Samantha : చైతూని తప్ప అక్కినేని ఫ్యామిలీ అందర్నీ ఫాలో అవుతున్న సమంత

ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను సామ్ డిలీట్ చేసింది. కానీ నాగ చైతన్య మాత్రం సమంత ఫోటోలని డిలీట్ చేయలేదు. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌ లో నాగ చైతన్యని అన్‌ఫాలో..

Samantha : చైతూని తప్ప అక్కినేని ఫ్యామిలీ అందర్నీ ఫాలో అవుతున్న సమంత

Samantha

Updated On : March 22, 2022 / 10:06 AM IST

Naga Chaitanya :  టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న చైతూ, సమంతలు ప్రేమ పెళ్లి చేసుకున్నా గతేడాది అక్టోబర్‌ 2న విడిపోయారు. వీరు విడిపోవడంతో అభిమానులు చాలామంది బాధపడ్డారు. ఈ జంట విడిపోయి దాదాపు ఐదు నెలలు అవుతున్న ఇంకా సోషల్ మీడియాలో, వార్తల్లో వీరి విడాకులు హాట్‌టాపిక్‌గానే ఉన్నాయి. విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్‌ బిజీ అయ్యారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత వరుస ప్రాజెక్టులకి ఓకే చెప్తుంది.

RRR : థియేటర్ వద్ద బ్యానర్స్ విషయంలో గొడవ.. ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్నం..

ఇక ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి నాగ చైతన్య ఫోటోలను సామ్ డిలీట్ చేసింది. కానీ నాగ చైతన్య మాత్రం సమంత ఫోటోలని డిలీట్ చేయలేదు. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌ లో నాగ చైతన్యని అన్‌ఫాలో చేసింది. ఇటు నాగ చైత‌న్య మాత్రం సమంత ఇన్‌స్టా అకౌంట్‌ను అన్ ఫాలో చేయకుండా ఇంకా ఫాలో అవుతున్నాడు. అంతేకాక చైతన్యను అన్ ఫాలో చేసిన సమంత అక్కినేని ఫ్యామిలిలో నాగార్జున‌, అమ‌ల‌, అఖిల్‌.. ఇలా అందర్నీ ఫాలో అవుతుండటం విశేషం. ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొంతమంది చైతూ ఫ్యాన్స్ దీనిని తప్పు పడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Chay Sam

Chay Sam