Samantha : శాకుంతలం సినిమా రిజల్ట్ పై సమంత వైరల్ పోస్ట్..

సమంత తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసింది. అది చూసిన నెటిజెన్లు శాకుంతలం రిజల్ట్ గురించే సమంత ఈ పోస్ట్ వేసింది అంటున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే..

Samantha : శాకుంతలం సినిమా రిజల్ట్ పై సమంత వైరల్ పోస్ట్..

Samantha viral post on Shaakuntalam movie result

Updated On : April 18, 2023 / 6:22 PM IST

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన రీసెంట్ మూవీ శాకుంతలం (Shaakuntalam). మైథ‌లాజిక‌ల్ డ్రామా వచ్చిన ఈ సినిమాని గుణశేఖర్ తెరకెక్కించాడు. హిందూ పురాణాల్లోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సమంత శకుంతల పాత్ర, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్ర పోషించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో నటించి వెండితెర అరంగేట్రం చేసింది. దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

Samantha : నాకు అన్ని ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను.. కానీ ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను.. 

అయితే సినిమా ఆడియన్స్ అనుకున్నంత రేంజ్ లో లేకపోవడంతో థియేటర్ వద్ద సోసోగా నడుస్తుంది. కాగా సమంత తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసింది. అది చూసిన నెటిజెన్లు శాకుంతలం రిజల్ట్ గురించే సమంత ఈ పోస్ట్ వేసింది అంటున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.. “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ” అని రాసుకొస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ వ్యాఖ్యలు అర్ధం ఏంటంటే.. “నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి” అని మీనింగ్.

ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ‘గో ఫార్‌వార్డ్ సమంత’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) కలిసి ఖుషీ సినిమాలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ సమంతతో పాటు విజయ్ దేవరకొండకి, శివ నిర్వాణకు కూడా చాలా అవసరం. మరి ఖుషీతో ఆడియన్స్ ని ఖుషీ చేయగలరా లేదా చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)