Samantha : పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమంత.. దివ్యాంగుడితో ఫోటో దిగి.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంది.

Samantha : పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమంత.. దివ్యాంగుడితో ఫోటో దిగి.. వైరల్ అవుతున్న వీడియో..

Samantha visited Sri Padmavati Ammavaari Temple in Tiruchanur

Updated On : March 4, 2024 / 2:57 PM IST

Samantha : సమంత ఆరోగ్యం పై ఫోకస్ చేయాలని ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పక్క తన బిజినెస్ లు చూసుకుంటూ, మరో పక్క ఇటీవలే హెల్త్ పాడ్ కాస్ట్ లు మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది సమంత. సమంత త్వరగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తాజాగా సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంది. నేడు ఉదయం సమంత తిరుచానూరు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం సమంత బయటకి వస్తుండగా పలువురు ఫోటోల కోసం ఎగబడ్డారు.

Also Read : Mahesh Babu – Nani : నాని మొదటి సినిమాలో.. మహేష్ బాబు, కృష్ణ గెస్ట్ అప్పీరెన్స్ ప్లాన్ చేశారు.. కానీ..

అయితే సమంతని తన టీం దగ్గరుండి తీసుకువెళ్లిపోతుండగా ఓ వికలాంగుడు సమంతతో ఫోటో కోసం వచ్చాడు. వెళ్ళిపోతున్న సమంత అతని కోసం ఆగి అతనికి ఫోటో ఇచ్చి వెళ్ళిపోయింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సమంత ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. మరోసారి సమంత మంచి మనసుని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.