Santosh Shobhan : సంక్రాంతి బరిలో చిన్న సినిమా.. స్టార్ హీరోలకి పోటీగా యువ హీరో..

పెద్ద సినిమాలు ఉండగా తాజాగా ఓ చిన్న సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. అసలు ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాని సంక్రాంతికి అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు............

Santosh Shobhan : సంక్రాంతి బరిలో చిన్న సినిమా.. స్టార్ హీరోలకి పోటీగా యువ హీరో..

Santhosh Shobhan in sankranthi race with kalyanam kamaneeyam movie

Updated On : December 9, 2022 / 2:41 PM IST

Santosh Shobhan :  ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వీటికి మధ్యలో డబ్బింగ్ సినిమా వారసుడు వచ్చి చేరింది. దీంతో ఇప్పటికే సంక్రాంతి సినిమాలకి థియేటర్ల సమస్య ఉంది. పెద్ద సినిమాలు ఉండగా తాజాగా ఓ చిన్న సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. అసలు ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాని సంక్రాంతికి అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు.

యువ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పేపర్ బాయ్, మంచి రోజులొచ్చాయి లాంటి సినిమాలతో విజయం సాధించిన సంతోష్ శోభన్ ఇటీవలే లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం సంతోష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సిరీస్ లు కూడా చేస్తున్నాడు.

నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్ని మంచి శకునములే’ సినిమా త్వరలో వస్తుందని అంతా భావించారు. డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. కానీ సడెన్ గా ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించి సంతోష్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా, తమిళ బ్యూటీ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా కళ్యాణం కమనీయం సినిమా తెరకెక్కుతుంది.

Pawan Kalyan : హరిహర వీరమల్లు సెట్ నుంచి పవన్ తో ఫోటో పోస్ట్ చేసిన హారిష్ శంకర్.. వైరల్ అవుతున్న పిక్..

అసలు ఈ సినిమాని అనౌన్స్ కూడా చేయకుండా, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు షూటింగ్ చేశారు, ఏకంగా పెద్ద హీరోలతో సంక్రాంతి బరిలో దింపేశారు అని టాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. మరి పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాకి థియేటర్స్ దొరుకుతాయా, ఈ సినిమా ప్రేక్షకులని పండక్కి మెప్పిస్తుందా చూడాలి మరి.