Sarath Babu : ఇంకా హాస్పిటల్ లోనే శరత్ బాబు.. అత్యంత విషమంగా ఆరోగ్యం..

ప్రస్తుతం శరత్ బాబుకు ICU లో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు అన్నారు. ఈ రోజు సాయంత్రం శరత్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Sarath Babu : ఇంకా హాస్పిటల్ లోనే శరత్ బాబు.. అత్యంత విషమంగా ఆరోగ్యం..

Sarath Babu effected with serious Health Issue treatment in ICU

Updated On : April 23, 2023 / 3:23 PM IST

Sarath Babu :  ప్రముఖ నటుడు శరత్ బాబు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ కు తరలించారు. రెండు రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే నేడు శరత్ బాబు పరిస్థితి మరింత విషమంగా ఉందని సమాచారం. ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ.. లాంటి ప్రధాన అవయవాలు పాడైనట్లు, ప్రస్తుతం ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Sarath Babu : సినీ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి.. లేటెస్ట్ అప్డేట్!

ప్రస్తుతం శరత్ బాబుకు ICU లో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు అన్నారు. ఈ రోజు సాయంత్రం శరత్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు శరత్ బాబు. తన సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి అనేక విజయాలు సాధించారు. ఇప్పటికి కూడా అడపాదడపా ఏదో ఒక సినిమాలో కనిపిస్తున్నారు శరత్ బాబు. ఆయన ఇలా హాస్పిటల్ లో చేరడంతో త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.