Kannappa : కన్నప్పలో ఇద్దరు పెద్దరాయుళ్లు.. రియల్ పెద్దరాయుడు ఎవరు తెలుసా..?
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' రానురాను బిగ్గెస్ట్ మూవీగా మారుతూ వెళ్తుంది.

Sarathkumar Mohan Babu in Manchu Vishnu Kannappa Movie
Kannappa : మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ తెరకెక్కించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్ అడవుల్లో జరుగుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం రానురాను బిగ్గెస్ట్ మూవీగా మారుతూ వెళ్తుంది. సౌత్ టు నార్త్ బడా స్టార్స్ అంతా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెడుతున్నారు. మొదటి ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అంటూ తెలియజేసి పాన్ ఇండియా వైడ్ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.
ఆ తరువాత మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మధుబాల, నయనతార వంటి స్టార్స్ కూడా నటించబోతున్నారు అంటూ ప్రకటించి మరింత హైప్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ నటుడు కూడా ఎంట్రీ ఇచ్చారు. మనకి పెద్దరాయుడు అనగానే మోహన్ బాబు గుర్తు వస్తారు. అయితే అసలు రియల్ పెద్దరాయుడు ఎవరు అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. మోహన్ బాబు చేసిన పెద్దరాయుడు సినిమా తమిళ హిట్ మూవీ ‘నట్టమై’కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పెద్దరాయుడుగా శరత్ కుమార్ నటించారు.
Also read : Nani : నేషనల్ అవార్డులపై మరోసారి నాని వైరల్ కామెంట్స్.. అల్లు అర్జున్, జై భీమ్ కాంట్రవర్సీ..
తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ఈ మూవీ, తెలుగులో అంతకుమించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు పెద్దరాయుళ్లు కలిసి కన్నప్ప చిత్రంలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తూనే ఒక ముఖ్య పాత్రని కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర కోసం శరత్ కుమార్ ని కూడా ఎంపిక చేసుకున్నారట. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కోసం శరత్ కుమార్ న్యూజిలాండ్ చేరుకున్నారు. అక్కడ మోహన్ బాబుతో కలిసి శరత్ కుమార్ దిగిన ఫోటో.. ఇద్దరు పెద్దరాయుళ్లు హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది.