‘హి ఈజ్ సో క్యూట్’ చిన్నారుల స్టెప్స్ చూశారా!

  • Published By: sekhar ,Published On : November 14, 2020 / 02:12 PM IST
‘హి ఈజ్ సో క్యూట్’ చిన్నారుల స్టెప్స్ చూశారా!

Updated On : November 14, 2020 / 2:55 PM IST

Sarileru Neekevvaru Kids Dance: సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ‘హి ఈజ్ సో క్యూట్’ అనే పాటలో రష్మిక స్టైలిష్ స్టెప్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది.


ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పలు స్పూఫ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ‘హి ఈజ్ సో క్యూట్’ అనే పాటకు నైనిక, తనయ అనే చిన్నారులు వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


తనయ మధ్యమధ్యలో వచ్చి జాయిన్ అవగా నైనిక మాత్రం ముద్దు ముద్దు మూమెంట్స్‌తో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా బాగా performe చేసింది. ఈ చిన్నారుల డ్యాన్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.