Sarkaru Vaari Paata : ఆడియోతోనే అదిరిపోయే రికార్డ్..!

తెలుగులో హయ్యెస్ట్ రేట్‌కి ఆడియో రైట్స్ అమ్ముడయ్యింది ఈ సినిమాకే కావడం విశేషం..

Sarkaru Vaari Paata : ఆడియోతోనే అదిరిపోయే రికార్డ్..!

Sarkaru Vaari Paata Audio Rights

Updated On : July 31, 2021 / 12:40 PM IST

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. ఇటీవలే దుబాయ్‌లో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. మహేష్ పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

Sarkaru Vaari Paata : సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫస్ట్ నోటీస్ వచ్చేస్తోంది..

పుట్టినరోజుకి పది రోజుల ముందుగానే ‘సర్కారు వారి పాట’ ఫెస్ట్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఇందులో భాగంగా జూలై 31 సాయంత్రం 4:05గంటలకు ‘సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్’ ఇవ్వబోతున్నారు. మహేష్‌ని కొత్త గెటప్‌లో చూడ్డానికి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్‌కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది సూపర్‌స్టార్ సినిమా..
రీసెంట్‌గా ‘సర్కారు వారి పాట’ ఆడియో రైట్స్ ‘సారెగమా’ సంస్థ సొంతం చేసుకుంది. ఈ హక్కులకోసం అక్షరాలా 4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.

Mahesh - Thaman

తెలుగులో హయ్యెస్ట్ రేట్‌కి ఆడియో రైట్స్ అమ్ముడయ్యింది ఈ సినిమాకే కావడం విశేషం. ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు. ‘అల.. వైకుంఠపురములో’ నుండి మళ్లీ థమన్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగులో 8, తమిళ్‌లో 2, హిందీలో 1 సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఆంజనేయులు’ తర్వాత పరశురామ్‌తో, ‘దూకుడు’, ‘బిజినెస్ మెన్’, ‘ఆగడు’ తర్వాత మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం పనిచేస్తున్నారు థమన్.