Sarkaru Vaari Paata: ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. మహేష్ బర్త్ డే బ్లాస్టర్ వచ్చేసింది
సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కార్ వారి పాట టీజర్ వచ్చేసింది. మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ పేరుతో.. పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసింది మైత్రీ మూవీస్.

Super Star
Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కార్ వారి పాట టీజర్ వచ్చేసింది. మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ పేరుతో.. పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసింది మైత్రీ మూవీస్. ఈ ట్రైలర్‌లో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ఈ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వాస్తవానికి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(9 ఆగస్ట్ 2021) ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు సర్కారు వారి పాట టీజర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. కానీ ఉన్నట్టుండి రాత్రే 12 గంటలకు టీజర్ రిలీజ్ చేసేశారు.
రాత్రికి రాత్రే మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ టీజర్‌కు ఎన్నో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. టీజర్ విషయానికొస్తే మహేష్ బాబు అల్ట్రా స్టైలీష్‌గా ఉన్నాడు అనే కామెంట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌లో కీర్తీ సురేష్ నటన కూడా ఆకట్టుకుంటోంది. ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. అంటూ స్టార్ట్ అయిన టీజర్‌ను మీరూ చూసెయ్యండి.