Kiran Abbavaram : రేచీకటి పాత్రలో కిరణ్ అబ్బవరం.. ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం తన తర్వాతి సినిమా ‘సెబాస్టియన్ PC 524’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా 'సెబాస్టియన్ పిసి 524' టీజర్.......

Kiran
Sebastian PC 524 : ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై, ‘SR కల్యాణ మండపం’తో మెప్పించి ఇండస్ట్రీలో అందరితో మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తూ వరుస సినిమా అవకాశాలని సాధిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటికే ఈ యువ హీరో చేతిలో దాదాపు అయిదు సినిమాలు ఉన్నాయి. ఇటీవల తన తర్వాతి సినిమా ‘సెబాస్టియన్ PC 524’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ‘సెబాస్టియన్ పిసి 524’ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
‘నీకు రేచీకటి అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా’ అని తల్లి చెప్పే మాటతో ‘సెబాస్టియన్ పిసి524’ టీజర్ మొదలైంది. సినిమాలో హీరోకి రేచీకటి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ కానిస్టేబుల్ సెబాస్టియన్ అనే పాత్రలో నటిస్తున్నాడు.
Vishnu Vishal : తండ్రి మాట్లాడుతుంటే స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో
రేచీకటి గల హీరోకి నైట్ డ్యూటీ వేస్తే అతను ఎలా డీల్ చేశాడు? గుడికి, చర్చికి రెండిటికి ఎందుకు వెళ్తున్నాడు? రాత్రి పూట మదనపల్లి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు? అనే కథాంశంతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. టీజర్ తో ప్రేక్షకులకి వినోదంతో పాటు సస్పెన్స్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. మొదటి రెండు సినిమాలతో మెప్పించిన కిరణ్ ఈ మూడో సినిమాతో ఎలా మెప్పిస్తాడా చూడాలి.