Urvashivo Rakshasivo: అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్!

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్‌లో రాబోతున్న తాజా చిత్రం "ఊర్వశివో రాక్షసివో’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

Urvashivo Rakshasivo: అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్!

Second Single Song Out Form Urvashivo Rakshasivo

Updated On : October 17, 2022 / 9:24 PM IST

Urvashivo Rakshasivo: భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్‌లో రాబోతున్న తాజా చిత్రం “ఊర్వశివో రాక్షసివో’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

Allu Sirish: ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేయసితో సరసాలాడుతోన్న మెగా హీరో!

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్‌కు, ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.

Allu sirish : జనాలు ‘ఆహా’కి నాకు సంబంధం ఉంది అనుకుంటున్నారు

రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు. ఈ సినిమాలోని ‘మాయారే’ అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించిన ఈ పాటను, కాసర్ల శ్యామ్‌ రచించారు. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని GA-2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.