Custody Movie: కస్టడీ నుండి ‘టైమ్‌లెస్ లవ్’ అంటూ వింటేజ్ సాంగ్ పట్టుకొస్తున్న చైతూ

అక్కినేని యువ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ నుండి రెండో సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Custody Movie: కస్టడీ నుండి ‘టైమ్‌లెస్ లవ్’ అంటూ వింటేజ్ సాంగ్ పట్టుకొస్తున్న చైతూ

Second Song Timeless Love From Custody Movie To Be Out

Updated On : April 22, 2023 / 7:11 AM IST

Custody Movie: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Custody Movie: కస్టడీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చిన చైతూ.. ఫ్యాన్స్ గెట్ రెడీ!

ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ వీడియోలు ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ వింటేజ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘టైమ్‌లెస్ లవ్’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సాంగ్‌కు సంబంధించి ఓ వింటేజ్ పోస్టర్‌ను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. నాగచైతన్యతో పాటు హీరోయిన్ కృతి శెట్టి ఈ పోస్టర్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నారు.

Custody Movie: ‘కస్టడీ’ టీజర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. ఏకంగా 15 మిలియన్ వ్యూస్!

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటంతో ఈ సినిమా పాటలపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో నాగ చైతన్య బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్‌బస్టర్‌ను అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి టైమ్‌లెస్ లవ్ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఈ పాట రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.