Viral Pics : కాలేజీ రోజుల్లో ఈ టాప్ హీరోయిన్లు ఎలా ఉన్నారో చూడండి..
తాము ఎంతగానో ఆరాధించే అభిమాన స్టార్స్ చిన్నప్పుడు.. చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవారో చూడాలని, తెలుసుకోవాలని అభిమానులకు ఆరాటంగా ఉంటుంది. ముగ్గురు టాప్ హీరోయిన్లు కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవారో చూడాలంటే వారు చదువుకున్న కాలేజీ పోస్టు చేసిన ఫోటోలు చూడాల్సిందే!!

Viral Pics
Viral Pics : దీపికా పదుకోన్, అనుష్క శర్మ, అనుష్క శెట్టి ముగ్గురు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. వీరు ముగ్గురు చదువుకున్న బెంగళూరు మౌంట్ కార్మెల్ కాలేజీ తాజాగా వీరి అప్పటి ఫోటోలను తమ సోషల్ మీడియా పేజీలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
Prabhas : ప్రభాస్ ఆ డైరెక్టర్స్ వద్దే కంఫర్టబుల్‌గా ఉంటాడట.. పాపం రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో..
దీపికా పదుకోన్, అనుష్క శర్మ, అనుష్క శెట్టి ముగ్గురు టాప్ స్టార్లుగా ఎదిగారు. ఎంతో ప్రతిభతో తమ కెరియర్లను తీర్చిదిద్దుకున్నారు. వీరు ముగ్గురు బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో చదువుకోవడం విశేషం. తాజగా ఈ కాలేజీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీరు ముగ్గురు కాలేజీలో చదువుకున్నప్పటి ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు వారిని చూసి ముచ్చటపడుతున్నారు.
దీపికా పదుకోన్ 20 సంవత్సరాల క్రితం ఫోటో.. అంటే 2004 లో ఒక నాటకంలో నటించినప్పటి ఫోటో షేర్ చేసారు. అనుష్క శర్మ మరొక అమ్మాయితో నిలబడి కెమెరాకి నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటో 2006 లో తీసినదట. ఈ ఫోటో వెనుక కనిపించే భవనం పాత హోమ్ సైన్స్ బ్లాక్ అని తెలుస్తోంది. ఇక అనుష్క శెట్టి ట్రంపెట్ పట్టుకుని కనిపించారు. తెల్లటి కుర్తా సెట్‌లో జాకెట్, క్యాప్ ధరించి ఉన్నారు. ఈ ఫోటో చూస్తే ఏదో ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు అనిపించింది.
Taapsee Pannu : ఆ ఆటగాడితో డేటింగ్ విషయంలో వాస్తవాలు చెప్పిన నటి
వీరు ముగ్గురు ఇండియన్ సినిమాల్లో తమదైన ప్రతిభతో విజయాలను సాధించారు. దీపికా ఫైటర్, సింగమ్ 3, కల్కి 2898AD సినిమాలతో బిజీగా ఉన్నారు. అనుష్క శర్మ చక్దా ఎక్స్‌ప్రెస్, అనుష్క శెట్టి మళయాళంలో కథనార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ ముగ్గురు టాప్ హీరోయిన్లు ఒకే కాలేజీలో చదువుకోవడం.. ఒకే కెరియర్ లో స్థిరపడి పేరు తెచ్చుకోవడం నిజంగా గర్వకారణం.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram