Sehari Trailer : ‘ఆలియాను చేసుకోమంటే.. అక్కని తగులుకున్నాడు’.. ట్రైలర్ చూశారా?
యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘సెహరి’ ట్రైలర్..

Sehari Trailer
Sehari Trailer: ‘సెహరి’ మూవీతో టాలీవుడ్‌కి హర్ష్ కానుమిల్లి అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సిమ్రన్ చౌదరి కథానాయికగా నటిస్తుండగా, అక్షిత కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా పరిచయమవుతున్నారు.. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై శిల్పా చౌదరి, అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు.
పోస్టర్లతో పాటు టీజర్‌తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు టీం. బుధవారం ‘సెహరి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. యూత్‌కి నచ్చేవిధంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. లవ్ విషయంలో యూత్ క్లారిటీ లేకుండా ఉంటే ఎలా ఉంటుదనేది ట్రైలర్‌లో చూపించారు.
NTR 31 : ఎన్టీఆర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్
సీనియర్ సంగీత దర్శకుడు కోటి హీరో తండ్రిగా నటించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ ఫ్రెష్‌గా అనిపించింది. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా సెట్ అయ్యాయి. అభినవ్ గోమటం, స్నేహా వెలిదిండి ఇతర పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 11న ‘సెహరి’ థియేటర్లలోకి రాబోతుంది.