Senior Actor Allam Gopala Rao passed away
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 8 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
Sreeleela Birthday : శ్రీలీల బర్త్ డే.. ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ పోస్టర్..
గోపాలరావు మృతి పట్ల సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రాస్థానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.