Anupam Shyam : అనుపమ్ శ్యాం కన్నుమూత
బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ శ్యాం (63) తీవ్ర అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. కిడ్నీ ఇన్పెక్షన్, పలు అవయవాల ఫెయిల్యూర్ సమస్యలతో అనుపమ్ శ్యాం గత కొంతకాలంగా ముంబై నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు.

Anupam Shyam
Anupam Shyam : బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ శ్యాం (63) తీవ్ర అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. కిడ్నీ ఇన్పెక్షన్, పలు అవయవాల ఫెయిల్యూర్ సమస్యలతో అనుపమ్ శ్యాం గత కొంతకాలంగా ముంబై నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు. కాగా అనుపమ్ శ్యాం మన్ కీ అవాజ్, ప్రతిజ్ఞ టీవీ షోల్లో పాల్గొన్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్, బండిట్ క్వీన్ సినిమాల్లోనూ నటించారు. హైబ్లడ్ షుగర్ తో బాధపడుతున్న అనుపమ్ శ్యాం ఇంజెక్షన్లు తీసుకొని యశ్ పాల్ శర్మతో కలిసి చివరి సినిమా షూటింగులో పాల్గొన్నారు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో సత్య, దిల్ సే, లగాన్ లాంటి హీట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.