Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత..

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటి రజిత తల్లి మరణించారు.

Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత..

Senior Character Artist Rajitha Mother Passed away with Heart Attack

Updated On : March 21, 2025 / 4:57 PM IST

Rajitha Mother : తాజాగా టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటి రజిత తల్లి మరణించారు. రజిత తల్లి విజయలక్ష్మి 76 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. నేడు మార్చ్ 21 శుక్రవారం మధ్యాహ్నం ఆవిడ కన్నుమూశారు. అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు ఫిలింనగర్ మహా ప్రస్తానంలో నిర్వహిస్తారని సమాచారం.

rajitha mother

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రజిత ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె తల్లి మరణించడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మికి చెల్లెళ్లు అవుతారు.