పసుపులేటి రామారావు కన్నుమూత – సినీ పరిశ్రమ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు..

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు..
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు(70) అనారోగ్యంతో బుధవారం (ఫిబ్రవరి 11) కన్నుమూశారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురైన ఆయన్ని ఆదివారం వనస్థలిపురంలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. బుధవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రామారావుకి భార్య, కుమారుడు ఉన్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ జర్నలిస్ట్‌గా ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే వారపత్రిక జ్యోతి చిత్ర సహా శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికల్లో పనిచేశారు. అనేక సినిమాలకు పీఆర్వోగా కూడా వ్యవహరించారు.. సావిత్రి, చిరంజీవి, టి.కృష్ణ సహా పలువురు దిగ్గజాలపై ఆయన పుస్తకాలను రచించారు.
రామారావు.. భానుమతి, సావిత్రి, శ్రీశ్రీ, దాసరి, చిరంజీవి లాంటి వాళ్లకు అత్యంత సన్నిహితుడు. ఆత్మ కథ రాసుకున్న తొలి ఫిలిం జర్నలిస్ట్ ఆయనే. రామారావుకి సినిమా పరిశ్రమ తో 45 ఏళ్లకు పైగా అనుబంధముంది. రామారావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రామారావు మరణం కలచి వేసిందని, ఆయన కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని చిరు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.