ఎన్‌టీఆర్‌కు కారు లేదు.. ‘నువ్వు నా పేరు నిలబెడుతావ్’ అనేవారు

  • Published By: vamsi ,Published On : April 21, 2019 / 07:41 AM IST
ఎన్‌టీఆర్‌కు కారు లేదు.. ‘నువ్వు నా పేరు నిలబెడుతావ్’ అనేవారు

Updated On : April 21, 2019 / 7:41 AM IST

తాత వారసత్వం నిలబెడుతూ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న జూనియర్ ఎన్‌టీఆర్‌కు తన తాత సీనియర్ ఎన్‌టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని సీనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పుడు ఎన్‌టీఆర్‌కు ఏమీ తెలియని వయసులో తాతను కలిసేందుకు వచ్చి ఆయన చుట్టూనే తిరిగేవాడిని, ‘‘సార్ అబిడ్స్‌ ఇంట్లో ఉండే సమయంలో జూ ఎన్టీఆర్ తన తల్లి శాలినితో కలిసి నల్లకుంటలోని శంకర్‌మఠ్ సమీపంలో ఉండేవారని అన్నారు. అప్పుడు తాతను కలిసేందుకు వాళ్ల అమ్మ వండిన వంటకాలను క్యారేజ్ కట్టుకుని వచ్చేవాడని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాగానే పెద్దాయన(సీనియర్ ఎన్టీఆర్) ‘‘ఏం తాత ఏం తెచ్చావ్” అంటూ తెచ్చినవాటిని ఇష్టంగా తినేవారని, తిన్న తర్వాత సాయంత్రం మేము వెళ్లే కారులోనే వదిలి వస్తుండేవాళ్లం అని అన్నారు. శంకర్‌మఠ్ మెయిన్ రోడ్డు మీద కారు ఆపితే దిగి నడుచుకుంటూ వెళ్లేవాడని, బాబు ఇంటికి వెళ్లే వరకు పెద్దాయన కారులోనే ఉండి చూసేవారని లక్ష్మణ్ చెప్పారు.

అపుడు వారికి కారు కూడా లేదని, సొంతగా ఆటో ఉండేదని, ఆటోలోనే వచ్చేవాడని, ఆటో దించేసి వెళ్లిపోయాక సాయంత్రం వెళ్లేపుడు మేము కారులో తీసుకుని వెళ్లేవారమని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే పెద్దాయన సినిమా డైలాగులు అనర్గలంగా చెప్పేవారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.

ఒకసారి రవీంద్ర భారతిలో చిన్న నాటకం వేస్తున్నాడు జూనియర్ ఎన్‌టీఆర్.. అప్పుడు పెద్దాయన తన మేకప్ మేన్‌తో మేకప్ వేయించి, స్వయంగా ఫినిషింగ్ చేశారు. అనంతరం పోరా తాత నువ్వు ఫస్ట్ ఫ్రైజ్ కొట్టేస్తావు పో అన్నారు. పెద్దాయన చెప్పినట్లుగానే కప్పు పట్టుకుని రాగానే… ‘ఒరేయ్ నువ్వు నా పేరు నిలుపుతావురా’ అని పెద్దాయన జూనియర్ ఎన్‌టీఆర్‌తో అన్నారు అని గుర్తుచేసుకున్నారు డ్రైవర్ లక్ష్మణ్.