NTR 100 Years : ఎన్టీఆర్ తీరని కోరికగా ఆ సినిమా మిగిలిపోయింది.. ఏంటది?

నందమూరి తారక రామారావు తెలుగు తెర పై ఎన్నో పాత్రలు వేసి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా కీర్తిని అందుకున్నారు. అయితే ఆయన జీవితంలో ఒక పాత్ర మాత్రం తీరని కొరిగా మిగిలిపోయింది.

NTR 100 Years : నందమూరి తారక రామారావు తెలుగు తెర పై ఎన్నో పాత్రలు వేసి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా కీర్తిని అందుకున్నారు. అయితే ఆయన జీవితంలో ఒక పాత్ర మాత్రం తీరని కొరిగా మిగిలిపోయింది. బ్రిటిష్ వారి పై పోరాటం జరిపిన తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రని చేయాలని ఎంతో ఆశ పడ్డారు, ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. కానీ చివరికి అది తీరని కోరికగా మిగిలిపోయింది. అసలు ఎన్టీఆర్ కి ఆ పాత్ర చేయనల్నే కోరిక ఎలా పుట్టింది. ఆయన ఎన్నిసార్లు ఆ సినిమా తియ్యడానికి ప్రయత్నించారో ఇక్కడ తెలుసుకోండి.

NTR 100 Years : బాలకృష్ణ పెళ్ళికి వెళ్లని ఎన్టీఆర్.. రీజన్ ఏంటో తెలుసా?

1954 లో ఎన్టీఆర్ హీరోగా అగ్గిరాముడు సినిమా తెరకెక్కుతుంది. ఆ మూవీలో అంతర్గతంగా సాగే అల్లూరి సీతారామరాజు కథ కోసం రచయిత ఆత్రేయ ఒక పాటని రాశారు. అయితే ఆ పాట ఎన్టీఆర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. అల్లూరి జీవితాన్ని సినిమాగా తియ్యాలని కోరికను ఎన్టీఆర్ లో కలగా జేసింది. దీంతో ఆ సినిమా తెరకెక్కించేందుకు పనులు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పదాల రామారావు ని సంప్రదించారు. ఆ రోజుల్లో రాష్ట్రమంతటా పదాల రామారావు రాసిన అల్లూరి సీతారామరాజు నాటకానికి మంచి పేరు వచ్చింది.

NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?

దీంతో సినిమా కథ భాద్యతలు పదాల రామారావుకి అప్పజెప్పారు. సహా రచయితగా జూనియర్ సముద్రాలను నియమించారు. వీరిద్దరూ కలిసి ఒక కథని సిద్ధం చేశారు. అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఎన్టీఆర్ తొలి స్టిల్ ని చెక్ చేసి 1957 జనవరిలో పాట రికార్డుతో సినిమా స్టార్ట్ చేశారు. పదాల రామారావు రాసిన లిరిక్స్ తో ఘంటసాలతో కలిసి మొత్తం 12 మంది సింగర్స్ ఆ పాటని పాడారు. ఆ టైములో అప్పటి న్యూస్ పేపర్స్ లో కూడా ఈ విషయం వచ్చింది.

Senior NTR wants to play Alluri Seetarama Raju role

అయితే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు సినిమా పనులు నిలిచిపోయాయి. మళ్ళీ కొన్నాళ్ల తరువాత ఆ సినిమా కోసం ఎన్టీఆర్ పదాల రామారావుని సంప్రదించారు. సినిమాలో హీరోయిన్ పాత్ర లేకపోయావడంతో.. ఆ పాత్ర ఉండేలా ఒక కథ రాయమని కోరారు. ఇంతలో ఎన్టీఆర్ సీతారామం కళ్యాణం సినిమా తియ్యడం, అది సూపర్ హిట్ అవ్వడంతో అల్లూరి సీతారామరాజు సినిమా అటకెక్కింది. దాదాపు 8 ఏళ్ళ తరువాత వరకట్నం సినిమా అనౌన్స్ సమయంలో మళ్ళీ అల్లూరి చిత్రాన్ని ప్రకటించారు.

NTR 100 Years : ఎన్టీఆర్‌తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..

వరకట్నం సినిమాతో పాటు సమాంతరంగా అల్లూరి సీతారామరాజు సినిమాని కూడా తెరకెక్కిస్తాను అంటూ ప్రకటించినా అది జరగలేదు. ఇంతలో ఒక నిర్మాణ సంస్థ శోభన బాబుతో అల్లూరి చిత్రాన్ని తెరకెక్కిస్తామంటూ ప్రకటించిన ఆర్ధిక ఇబ్బందులు వల్ల అది జరగలేదు. దీంతో ఆ కథ సూపర్ స్టార్ కృష్ణ దగ్గరకి వెళ్ళింది. త్రిపురేని మహారథి ఆ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దగా 1974 లో కృష్ణ 100 వ సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్టుగా నిలిచింది. కానీ ఎన్టీఆర్ కి మాత్రం ఆ పాత్ర పై మమకారం పోలేదు.

NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!

సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో అల్లూరి సీతారామరాజుగా కాసేపు కనిపించి అలరించారు. అయితే ఎన్టీఆర్ ని అది తృప్తి పరచలేదు. దీంతో స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ని పిలిచి అల్లూరి సీతారామరాజు కథ సిద్ధం చేయమని అడిగారు. అయితే దానికి పరుచూరి బ్రదర్స్ బదులిస్తూ.. ఎన్టీఆర్ ని ఒకసారి కృష అల్లూరి సీతారామరాజు చూడాలని కోరారు. ఆ సినిమా ప్రింట్ ని తెప్పించుకొని చూసిన ఎన్టీఆర్.. కృష్ణని పిలిచి మరి అభినందించారట. ఆ తరువాత అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాలనే కోరికను పూర్తిగా వదులుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు