Aishwarya Addala : లక్షలు కాజేసి భర్తని మోసం చేసిన నటి.. మీడియాను ఆశ్రయించిన భర్త..

2023 సెప్టెంబర్ 6న నటి ఐశ్వర్య.. పిన్నింటి శ్యామ్ కుమార్ ల వివాహం జరిగింది.

Aishwarya Addala : లక్షలు కాజేసి భర్తని మోసం చేసిన నటి.. మీడియాను ఆశ్రయించిన భర్త..

Serial Actress Aishwarya Addala Cheat her Husband Shyam Kumar

Updated On : March 11, 2024 / 12:42 PM IST

Aishwarya Addala : అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది.. లాంటి పలు సీరియల్స్ లో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య అడ్డాల. పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం ఐశ్వర్య సీరియల్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఐశ్వర్యపై ఆమె భర్త ఆరోపణలు చేస్తూ మీడియాని ఆశ్రయించారు.

2023 సెప్టెంబర్ 6న నటి ఐశ్వర్య.. పిన్నింటి శ్యామ్ కుమార్ ల వివాహం జరిగింది. కాపు మ్యాట్రిమోని ద్వారా వీరి వివాహం కుదిరింది. పెళ్లి అయిన నెల రోజుల ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడింది. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహేత సంబంధం పెట్టుకుని, తనని బెదిరింపులకు పాల్పడుతుందంటూ భర్త శ్యామ్ ఆరోపనలు చేసాడు.

Also Read : Gaami : మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిన ‘గామి’.. కలెక్షన్స్‌లో అదరగొడుతుందిగా..

అంతేకాకుండా పెళ్లయిన తర్వాత పాతిక లక్షలు కాజేసి విడాకులు కావాలని, తనని, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసాడు శ్యామ్. తనకు న్యాయం చేయాలని బాధిత భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించాడు. అయితే దీనిపై ఐశ్వర్య ఇంకా స్పందించలేదు.