షూటింగ్‌లో స్టార్ హీరోకు గాయాలు

  • Published By: vamsi ,Published On : January 11, 2020 / 05:14 AM IST
షూటింగ్‌లో స్టార్ హీరోకు గాయాలు

Updated On : January 11, 2020 / 5:14 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌కు షూటింగులో గాయాలయ్యాయి. తెలుగు సినిమా ‘జెర్సీ’ రీమేక్‌లో చేస్తున్న షాహీద్ కపూర్.. క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా బంతి ఊహించని విధంగా వచ్చి ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్ర గాయమైంది. షాహిద్ కపూర్ పెదవి చిట్లి రక్తం రావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టరు అతని పెదవికి, తలకి కుట్లు వేశారు. మొత్తం 13కుట్లు పడినట్లుగా తెలుస్తుంది.

పెదవిపై అయిన గాయం నయం అవడానిరి వాపు తగ్గడానికి సమయం పడుతుందని, అప్పటివరకూ నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు షాహిద్‌కు సూచించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా షూటింగుకు ఐదు రోజులు గ్యాప్ వచ్చింది.  తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను హిందీ వెర్షన్‌లో అదే పేరుతో షాహిద్ హీరోగా నిర్మిస్తున్నారు.

జెర్సీ హిందీ వెర్షన్‌కు గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ , జాకీ ష్రాఫ్‌, పాంకే త్రిపాఠి, పంక‌జ్ క‌పూర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ హిందీ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#jersey #prep

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on