Shahrukh Khan : నీకు బ్యూటిఫుల్ పిల్లలు ఉన్నారు.. భార్య పోస్ట్ కి షారుఖ్ సరదా కామెంట్..

తాజాగా పెంగ్విన్ ఇండియా పబ్లిషర్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో షారుఖ్ ఫ్యామిలీ అంతా పాల్గొంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గౌరీఖాన్ తన పిల్లలు, షారుఖ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్యూట్ ఫ్యామిలీ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు.

Shahrukh Khan : నీకు బ్యూటిఫుల్ పిల్లలు ఉన్నారు.. భార్య పోస్ట్ కి షారుఖ్ సరదా కామెంట్..

Shahrukh Khan Family (Photo : Instagram)

Updated On : April 5, 2023 / 6:56 AM IST

Shahrukh Khan :  షారుఖ్ కి ముగ్గురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్(Aryan Khan), సుహానా ఖాన్(Suhana Khan), అబ్రమ్.. ముగ్గురు షారుఖ్ పిల్లలు. ఇక భార్య గౌరి ఖాన్(Gauri Khan) అందరికి తెలిసిందే. త్వరలోనే ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా డెబ్యూట్ ఇవ్వనున్నాడు. సుహానా ఖాన్ సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) ఓపెనింగ్ కార్యక్రమానికి అనేకమంది సినీ, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి షారుఖ్ ఫ్యామిలీ అంతా కూడా వచ్చింది. షారుఖ్, తన భార్య గౌరి ఖాన్, తన ముగ్గురి పిల్లలలతో కలిసి వేడుకకు హాజరయ్యాడు. ఈ వేడుకల్లో వీరంతా స్టైలిష్ డ్రెస్ లతో వచ్చి అదరగొట్టేసారు. NMACC ఓపెనింగ్ కార్యక్రమంలో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా పెంగ్విన్ ఇండియా పబ్లిషర్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో షారుఖ్ ఫ్యామిలీ అంతా పాల్గొంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గౌరీఖాన్ తన పిల్లలు, షారుఖ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్యూట్ ఫ్యామిలీ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు.

Sukumar: శిష్యుడి సినిమాపై గురువు కామెంట్.. సంతోషంతో పాటు గర్వంగా ఉందన్న సుకుమార్!

అయితే గౌరి ఖాన్ పోస్ట్ చేసిన ఫోటోకి షారుఖ్ కూడా సరదా కామెంట్స్ చేశాడు. గౌరీ పోస్ట్ చేసిన ఫోటోకి.. అరే.. ఎంత అందమైన పిల్లలని తయారుచేశావు గౌరి అని కామెంట్ చేశాడు. దీంతో షారుఖ్ చేసిన ఈ సరదా కామెంట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Gauri Khan (@gaurikhan)