Jawan Collections : ఎనిమిది రోజుల్లోనే జవాన్ 700 కోట్లు.. 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా?
షారుఖ్ జవాన్ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 129 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మూడు రోజుల్లో 350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. వీక్ డేస్ లో కూడా జవాన్ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

Shahrukh Khan Jawan Movie Collections reach 700 crores Gross Target 1000 Crores
Jawan Collections : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కింది.
జవాన్ సినిమా రిలీజ్ రోజు నుంచే భారీ విజయం సాధించింది. మనకు సౌత్ వాళ్లకి పాత కథే అయినా నార్త్ వాళ్లకి చాలా కొత్తగా ఉండటంతో సినిమాని ఆకాశానికెత్తేస్తున్నారు. మనకి తెలిసిన కథలో షారుఖ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు అట్లీ. దీంతో నార్త్ లో మరింత పెద్ద హిట్ అయింది. షారుఖ్ జవాన్ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 129 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మూడు రోజుల్లో 350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. వీక్ డేస్ లో కూడా జవాన్ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
తాజాగా జవాన్ సినిమా ఎనిమిది రోజుల్లోనే ఏకంగా 696 కోట్లు కలెక్ట్ చేసినట్టు ప్రకటించింది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వీక్ డేస్ లో కూడా జనాలు బాగా వస్తున్నారని. షారుఖ్ పఠాన్ 1000 కోట్ల కలెక్షన్స్ రావడంతో జవాన్ సినిమా కుడా 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పటికే 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం జవాన్ కి కలిసొస్తుంది. మరి మిగిలిన 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి జవాన్ 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా చూడాలి.
Jawan conquering the Box Office like a soldier!?
Book your tickets now! https://t.co/B5xelU9JSg
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/dciyOVFgm8
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 15, 2023