Shahrukh Khan : సినిమా కలెక్షన్స్ పై షారుఖ్ పాత వీడియో వైరల్.. నాకన్ని తెలుసురా బాబు.. కలెక్షన్స్ గురించి మీరు చెప్పకండి..

తాజాగా షారుఖాన్ పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడాడు. పఠాన్ కలెక్షన్స్ మీద అనుమానాలు వస్తున్న తరుణంలో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Shahrukh Khan : సినిమా కలెక్షన్స్ పై షారుఖ్ పాత వీడియో వైరల్.. నాకన్ని తెలుసురా బాబు.. కలెక్షన్స్ గురించి మీరు చెప్పకండి..

Shahrukh Khan old video goes viral in that spoke about Movie Collections

Shahrukh Khan :  బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత పఠాన్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. గత రెండేళ్లుగా పెద్దగా సక్సెస్ లు చూడని బాలీవుడ్ కూడా పఠాన్ సినిమా సక్సెస్ ని బాగా సెలబ్రేట్ చేసుకుంది. అయితే పఠాన్ సినిమా కలెక్షన్స్ పై విమర్శలు కూడా వచ్చాయి. ఇవి నిజమైన కలెక్షన్సేనా అంటూ పలువురు అనుమానాలు కూడా వ్యక్తపరిచారు.

ఇటీవల ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా షారుఖ్ పఠాన్ సినిమా కలెక్షన్స్ పై అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడింది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. తాజాగా షారుఖాన్ పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడాడు. పఠాన్ కలెక్షన్స్ మీద అనుమానాలు వస్తున్న తరుణంలో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Varalaxmi Sarathkumar : ఇండస్ట్రీకి దొరికిన లేడీ విలన్.. అప్పుడే 50 సినిమాలు పూర్తి చేసేసిన వరలక్ష్మి..

ఈ వీడియోలో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. అందరూ నాకు కలెక్షన్స్ ఇంతొచ్చింది, అంతొచ్చిందని మెసేజ్ లు చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మెసేజ్ లు పంపుతూ ఉంటారు. సినిమా కలెక్షన్స్ గురించి దయచేసి నాకు మెసేజ్ లు పంపకండి. నేను సినిమాలు చేస్తాను, నిర్మిస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నాకు సినిమా కలెక్షన్స్ గురించి తెలుసు. ఈ బిజినెస్ లోనే నేను ఉన్నాను. సోమవారం, మంగళవారం.. ఇలా ప్రతి రోజు ఎంత కలెక్షన్స్ వస్తుంది అనేది నాకు తెలుసు. కొంతమంది వాళ్ళ ఇష్టమొచ్చిన కలెక్షన్స్ పంపిస్తారు ఫూల్స్ వాళ్ళు. నా సినిమాల కలెక్షన్స్ ప్రతి రూపాయి గురించి నాకు తెలుసు. మీరు తప్పుడు కలెక్షన్స్ పంపనవసరం లేదు. రోజూ నేను నా ఆఫీస్ లో ఆ లెక్కలు చూస్తాను. మీరు తప్పుడు లెక్కలు చెప్పకండి. కావాలంటే నన్ను అడగండి అంటూ మాట్లాడారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.