Shahrukh Khan : జవాన్ సినిమాకి సౌత్ వాళ్ళే ఎక్కువగా పనిచేశారు.. ఈ విజయం వాళ్లదే.. షారుఖ్ కామెంట్స్..
జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

Shahrukh Khan praises South Industry Workers who worked for Jawan Movie
Shahrukh Khan : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకి దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 1000 కోట్లకు దూసుకెళ్తుంది.
అయితే ఈ సినిమాలో ఎక్కువగా సౌత్ నటీనటులే ఉన్నారు. సినిమాని కూడా సౌత్ దర్శకుడే తెరకెక్కించాడు. మ్యూజిక్ కూడా సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు. అయితే సినిమాకి పనిచేసిన టెక్నిషియన్స్ కూడా ఎక్కువమంది సౌత్ వాళ్ళే అని సమాచారం. జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
RRR Movie : సైమా అవార్డుల్లో RRR హంగామా.. ఎన్ని కేటగిరీల్లో గెలుచుకుందో తెలుసా?
ఈ ప్రెస్ మీట్ లో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక సినిమాకి చాలా ఏళ్ళు ప్రయాణించడం రేర్ గా జరుగుతుంది. కరోనా, ఇతర కారణాల వల్ల జవాన్ సినిమా ప్రయాణం నాలుగేళ్ల పాటు సాగింది. నాలుగేళ్ల క్రితం అట్లీ నాకు కథ చెప్పాడు. అప్పట్నుంచి జవాన్ కొనసాగుతూనే ఉంది. జవాన్ సినిమాకు ఎంతోమంది సౌత్ వాళ్ళు పనిచేశారు. టెక్నిషియన్స్ కూడా చాలా మంది దక్షిణాది వాళ్ళు జవాన్ సినిమా కోసం కష్టపడ్డారు. కొన్ని నెలల పాటు ఇంటికి, కుటుంబాలకు దూరంగా ఉండి ముంబైలో ఉంటూనే జవాన్ సినిమా కోసం వాళ్లంతా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం కష్టపడిన టెక్నికల్ టీం నిజమైన హీరోలు. జవాన్ విజయం వాళ్లదే అని అన్నారు. దీంతో షారుఖ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.