Shahrukh Khan : ఒకప్పుడు రోజుకు 100 సిగరెట్లు తాగే షారుఖ్ ఖాన్.. బర్త్ డే రోజు ఫ్యాన్స్ తో సిగరెట్ మానేసాను అని ప్రకటన..
నిన్న షారుఖ్ ఖాన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు.

Shahrukh Khan says he quits smoking on his birthday in fans meet
Shahrukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. బాలీవుడ్ ని కొన్నాళ్ల పాటు ఏలాడు. మధ్యలో వరుస ఫ్లాప్స్ వచ్చినా ఇటీవల బ్యాక్ టు బ్యాక్ జవాన్, పఠాన్, డుంకి.. సినిమాలతో భారీ హిట్స్ కొట్టి కింగ్ స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. 59 ఏళ్ళ వయసులో బాలీవుడ్ బాద్షా అభిమానులను అలరించడానికి ఇంకా సినిమాలు చేస్తున్నాడు.
నిన్న షారుఖ్ ఖాన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. అయితే షారుఖ్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. మరో మంచి విషయం, ఇక నేను స్మోక్ మానేసాను అని తెలిపాడు. అలాగే స్మోక్ మానేసిన తర్వాత ఊపిరి పీల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంది అయినా ఈ మాట మీద నిలబడతాను అని అన్నారు షారుఖ్. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Prabhas : ప్రభాస్ ఆ పాట మొత్తం పాడేవాడట.. ఆర్జీవీ తీసిన ఆ సినిమా ప్రభాస్ కి ఇష్టమంట..
గతంలో షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో రోజుకు 100 సిగరెట్స్ కాల్చేవాడిని అని చెప్పాడు. అయితే షారుఖ్ గతంలో కూడా ఓ సారి సిగరెట్, ఆల్కహాల్ మానేస్తున్నాను నా పిల్లల కోసం అని చెప్పాడు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ ముందు మానేసాను అని అనౌన్స్ చేసాడు అదే మాట మీద ఉంటాడా లేదా చూడాలి. ఇక ఈ ఈవెంట్లో.. మరో పదేళ్లు ఫ్యాన్స్ ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తాను అని కూడా మాట ఇచ్చాడు.
#ShahRukhKhan celebrated his birthday with ardent fans yesterday. During the AskSrk session the megastar eagerly shared… 'Another good thing, I am not smoking anymore guys…' to which his fans gave the loudest cheer. #Watch @iamsrk #shahrukhkhanbirthday @shahrukhkhan_56 pic.twitter.com/JaqYiEe3Xy
— HT City (@htcity) November 3, 2024