శకుంతలా దేవి బయోపిక్ : గణిత మేధావిగా విద్యాబాలన్, కొంటెనతం, ధృడనిశ్చయం, జీవం నిండిన పాత్రని గొప్పగా చూపించింది

  • Published By: sekhar ,Published On : July 15, 2020 / 04:03 PM IST
శకుంతలా దేవి బయోపిక్ : గణిత మేధావిగా విద్యాబాలన్, కొంటెనతం, ధృడనిశ్చయం, జీవం నిండిన పాత్రని గొప్పగా చూపించింది

Updated On : July 15, 2020 / 5:17 PM IST

గత కొంత కాలంగా ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్ పర్సన్స్, సినిమా స్టార్స్, పొలిటిషియన్స్ వంటి వారి నిజ జీవిత కథలు వెండితెరపై సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తతం వివిధ భాషల్లో మరికొన్ని బయోపిక్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గణిత శాస్త్రవేత్త, హ్యుమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న అపర మేధావి శంకుతలా దేవి కథతో తెరకెక్కుతున్న బయోపిక్ ‘శకుంతలా దేవి’..

Shakuntala Devi On Prime on July 31

ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదల చేశారు. సినిమా జూలై 31న డిజిటల్ మాధ్యమమైన అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇందులో శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయారు. శకుంతలా దేవిగా డిఫరెంట్ గెటప్స్‌లో విద్యాబాలన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సాన్య మల్హోత్రా, అమిత్ సాధ్, జిస్సు సేన్‌గుప్తా తదితరులు కీలకపాత్రల్లో నటించగా అనూ మీనన్ దర్శకత్వం వహించారు.