రాజ్‌ తరుణ్ తో ‘అర్జున్‌ రెడ్డి’ భామ !

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 06:37 AM IST
రాజ్‌ తరుణ్ తో ‘అర్జున్‌ రెడ్డి’ భామ !

Updated On : May 4, 2019 / 6:37 AM IST

ప్రేమికులిద్దరిదీ ఒకటే లోకం. అందులో ఒకరు రాజ్‌ తరుణ్‌. మరి రాజ్‌ తరుణ్‌ ప్రేమ లోకంలో ఉన్నది ఎవరు? అనే విషయంపై క్లారిటీ దొరికింది. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ లాంగ్ గ్యాప్ తో మరోసారి దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడిగా షాలిని పాండే నటించనుంది. ఈ వార్త నిజమైతే రాజ్‌ తరుణ్, షాలినీ తొలిసారి జోడీ కట్టినట్లే.

అర్జున్ రెడ్డి సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాతే విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్ వచ్చింది. వరసపెట్టి పెద్ద బ్యానర్లలో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే విజయ్ కు అర్జున్ రెడ్డి ఆచొచ్చినట్లుగా, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండేకు కలిసి రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. షాలినికి ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న మరో ప్రేమకథలో అవకాశం దక్కింది. ఈ సినిమాకు జీఆర్‌ కృష్ణ దర్శకుడు. మరి ఈ సినిమాకి అయినా రాజ్‌ తరుణ్‌, షాలినిలకు హిట్ ఇస్తుందేమో చూడాలి.