Yuki Bhambri : యూఎస్ ఓపెన్ 2025లో అదరగొడుతున్న యుకీ బాంబ్రీ.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు..
యూఎస్ ఓపెన్ 2025లో భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ (Yuki Bhambri) సెమీస్‌కు దూసుకువెళ్లాడు.

Yuki Bhambri reaches his first ever Grand Slam semi final
Yuki Bhambri : యూఎస్ ఓపెన్ 2025లో భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ అదరగొడుతున్నాడు. డబుల్స్‌లో సెమీస్‌లోకి దూసుకువెళ్లాడు. కాగా.. యుకీ (Yuki Bhambri) కెరీర్‌లో ఓ గ్రాండ్ స్లామ్‌లో సెమీస్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
డబుల్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన మైకెల్ వెనుస్‌తో కలిసి యుకీ యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్నాడు. క్వార్టర్స్‌లో యుకీ బాంబ్రీ-మైకెల్ వెనుస్ జోడీ క్రొయేషియాకు చెందిన నికోలా మోక్టిక్-అమెరికాకు చెందిన రాజీవ్‌రామ్ జోడీతో తలపడింది. 6-3, 7-6, 6-3 యుకీ జోడీ నికోలా మెక్టిక్-రాజీవ్ రామ్‌పై గెలుపొందింది.
Amit Mishra retirement : 25 సంవత్సరాల కెరీర్.. ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా..
శుక్రవారం సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బ్రిట్స్ నీల్ స్కుప్స్కీ – జో శాలిస్‌బరీ జోడీతో యుకీ – మైకెల్ తలపడనుంది.
క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించిన తరువాత ముకీ బాంబ్రీ భాంబ్రీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఇది ఎంతో కఠినమైన మ్యాచ్ అని తెలిపాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు బహుళ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్లు అని చెప్పుకొచ్చాడు.
ఇక తన పార్ట్‌నర్ మైకెల్ వెనుస్ గురించి మాట్లాడుతూ.. తాము 15 సంవత్సరాలకు పైగా స్నేహితులం అని చెప్పుకొచ్చాడు. కలిసి ఆడేందుకు ఇదే సరైన సమయం అని అనిపించిదన్నాడు. అతడికి ప్రత్యర్థిగా ఎన్నో మ్యాచ్‌లు ఆడానని, అతడికి ప్రత్యర్థిగా ఉండాలని అనుకోవడం లేదన్నాడు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్ సమ్మర్ టోర్నీ నుంచి ఇప్పటి వరకు తమ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోందన్నాడు.