Amit Mishra retirement : 25 సంవత్సరాల కెరీర్.. ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా..
క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అమిత్ మిశ్రా (Amit Mishra retirement) తెలిపాడు.

Amit Mishra announces retirement from all forms of cricket
Amit Mishra retirement : టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. క్రికెట్ కు సంబంధించిన అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు(Amit Mishra retirement).
2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన అమిత్ మిశ్రా.. టీమ్ఇండియా తరుపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 76 వికెట్లు, వన్డేల్లో 64 వికెట్లు, టీ20ల్లో 16 వికెట్లు సాధించాడు. తన చివరి మ్యాచ్‌ను 2017లో ఆడాడు.
ఇక ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడాడు. 174 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో చివరి సారి 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున బరిలోకి దిగాడు.
🚨 AMIT MISHRA HAS ANNOUNCED HIS RETIREMENT FROM ALL FORMS. 🚨 pic.twitter.com/8Bo7nFkm3u
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2025
గాయాల బెడద, యువ ఆటగాళ్లకు ఛాన్స్ లు రావాలనే ఉద్దేశ్యంతోనే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు అమిత్ మిశ్రా తెలిపాడు. తన 25 సంవత్సరాల క్రికెట్ జీవితం తనకెంతో సంతృప్తినిశ్చిందన్నాడు. ఇంతకంటే గొప్ప విషయం తనకు మరొకటి లేదన్నాడు.
Yashasvi Jaiswal fail : దులీప్ ట్రోఫీ సెమీస్.. యశస్వి జైస్వాల్ విఫలం.. తొలి ఓవర్‌లోనే..
ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నట్లుగా తెలిపాడు. తన క్రికెట్ కెరీర్‌కు సాయపడిన బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్, సహాయక సిబ్బంది, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశాడు. తనకు ఎల్లవేళలా అంగా నిలిచిన అభిమానులకు కతృజ్ఞతలు తెలియజేశాడు.