Sara Tendulkar Engaged : మిస్టరీ ఫ్రెండ్‌తో సచిన్ కూతురు.. సారా టెండూల్కర్ గోవా ఫోటోలు వైరల్.. నిశ్చితార్థమైందా?
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ రిలేషన్ షిప్ (Sara Tendulkar Engaged) న్యూస్ వైరల్ అవుతోంది.

Is Sara Tendulkar Getting Engaged Goa Picture Sparks Buzz
Sara Tendulkar Engaged : మొన్న టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇప్పుడు కూతురు సారా టెండూల్కర్ రిలేషన్ షిప్ (Sara Tendulkar Engaged) న్యూస్ వైరల్ అవుతోంది.
ఆమె గోవా టూర్‌లో ఓ స్నేహితుడితో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అతడు ఎవరు అనే కనుగొనే ప్రయత్నాల్లో నెటిజన్లు నిమగ్నం అయ్యారు. ఆ యువకుడిని గోవాకు చెందిన సిద్ధార్థ్ కేర్కర్ అని గుర్తించారు. అతడికి టెండూల్కర్ కుటుంబంతో కూడా సత్సంబంధాలున్నాయని అంటున్నారు. పలు వేడుకల్లో సచిన్, ఆయన భార్య అంజలిలతో దిగిన ఫోటోల్లోనూ సిద్ధార్థ్ కనిపించాడు. ఇక ఆ కుటుంబంతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేశాడని అంటున్నారు.
ఎవరీ సిద్ధార్థ్ కేర్కర్ ?
సిద్ధార్థ్ కేర్కర్ ఒక కళాకారుడు. గోవాలోని ఒక రెస్టారెంట్‌కు సహ యజమాని అని చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 90,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతడిని సారా కూడా ఫాలో అవుతుంది. వీరిద్దరు కలిసి వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌లను వీక్షించారు. ఇవన్నీ వారి రిలేషన్ షిప్ వార్తలకు కారణం అయ్యాయి. అయితే.. ఇంతవరకు వీరి బంధంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురుగానే కాకుండా తనకంటూ ఓప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది సారా టెండూల్కర్. వెల్‌నెస్ పరిశ్రమలో తనకంటూ ఒక పేరును ఏర్పరచుకుంటున్నారు. ఆమె ఇటీవల ముంబైలో సొంత పైలేట్స్ స్టూడియోను ప్రారంభించింది, ఇక సోషల్ మీడియా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇన్‌స్టాలో 8.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Yashasvi Jaiswal fail : దులీప్ ట్రోఫీ సెమీస్.. యశస్వి జైస్వాల్ విఫలం.. తొలి ఓవర్‌లోనే..
ఇదిలా ఉంటే.. ఆమె తమ్ముడు, సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్ తో జరిగింది. త్వరలోనే అర్జున్, సానియాలు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు.