Lalit Modi-IPL First Match : ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కోసం.. అన్ని రూల్స్ బ్రేక్.. మెక్‌కల్లమ్ 158* రన్స్..
ఐపీఎల్ తొలి సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు తాను ప్రసార నియమాలను (Lalit Modi - IPL First Match ) ఉల్లంఘించానని..

Former IPL chairman Lalit Modi reveals shocking IPL breach
Lalit Modi – IPL First Match : క్రికెట్ ప్రపంచంలో విజయవంతమైన లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటి. ఇప్పటి వరకు విజయవంతంగా 18 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ లీగ్ తొలి సీజన్ 2008లో ప్రారంభమైంది. అప్పుడు దాని ఛైర్మన్‌గా లలిత్ మోదీ ఉన్నారు. తాజాగా ఆయన ప్రారంభ సీజన్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు. తొలి సీజన్‌లో మొదటి మ్యాచ్‌ను విజయవంతం చేయకపోతే తాను మరణించినట్లేనని భావించానని తెలిపాడు. అందుకోసం తాను ప్రసార నియమాలను (Lalit Modi – IPL First Match ) ఉల్లంఘించానని చెప్పాడు.
తొలి మ్యాచ్ పైనే ఐపీఎల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయం తనకు తెలుసునని చెప్పాడు. అందుకనే తాను ఆ రోజు నిబంధనలను అత్రికమించినట్లు వెల్లడించాడు. ‘ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. అయితే.. దాని నెట్‌వర్క్ పరిధి గురించి నేను ఆందోళన చెందాను. మ్యాచ్ అందరూ చూడాలని భావించాను. అందుకనే ఒకటే మాట చెప్పాను. లైవ్ మ్యాచ్‌ను అందరికి ఇద్దాం అని అన్నాను.’ అని చెప్పినట్లు లలిత్ మోదీ తెలిపారు.
ED Summons to Shikhar Dhawan : చిక్కుల్లో శిఖర్ ధావన్.. సమన్లు జారీ చేసిన ఈడీ
అందరికి లైవ్ ఇస్తే.. ఐపీఎల్‌ను చాలా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అందుకనే బ్రాడ్‌కాస్టర్లు, న్యూస్ ఛానళ్లు.. ఇలా ప్రతి ఒక్కరికి కూడా లైవ్ తీసుకోమని చెప్పినట్లుగా వెల్లడించాడు. అప్పుడు సోని నెట్‌వర్క్.. నా మీద దావా వేస్తాను? అని చెప్పిందన్నాడు.
ఇందుకు సమాధానంగా.. కావాలంటే నా మీద తరువాత దావా వేద్దురు గానీ.. ముందు అవన్ని మరిచిపోయి అందరికి లైవ్ ఇవ్వండి అని చెప్పినట్లుగా వెల్లడించాడు. ఆ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరు చూడడం తనకు ఎంతో ముఖ్యమని, ఒకవేళ ఆ మ్యాచ్ ఫ్లాఫ్ అయితే తాను కూడా మరణించినట్లే అని భావించానని లలిత్ మోదీ తెలిపారు.
ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్..
2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆర్‌సీబీకి రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా ఉండగా కేకేఆర్‌కు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించాడు.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లు బాది 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెక్‌కల్లమ్ తరువాత కేకేఆర్ బ్యాటర్లలో రికీ పాంటింగ్ చేసిన 20 పరుగులే రెండో అత్యధికం కావడం గమనార్హం.
Yashasvi Jaiswal fail : దులీప్ ట్రోఫీ సెమీస్.. యశస్వి జైస్వాల్ విఫలం.. తొలి ఓవర్‌లోనే..
223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఘోరంగా విపలమైంది. 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో కేకేఆర్ 140 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో బౌలర్ ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్) మాత్రమే రెండు అంకెల స్కోరు చేయగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
రాహుల్ ద్రవిడ్ (2), వసీం జాఫర్ (6), విరాట్ కోహ్లీ (1), జాక్వెస్ కలిస్ (8), కామెరూన్ వైట్ (6), మార్క్ బౌచర్ (7) లు ఘోరంగా విఫలం అయ్యారు. కేకేఆర్ బౌలర్లలో అజిత్ అగార్కర్ మూడు వికెట్లు తీశాడు. సౌరవ్ గంగూలీ, ఆశోక్ దిండా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ, లక్ష్మీ రతన్ శుక్లా లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆరంభ మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ మెరుపులు చూసిన అభిమానులు ఐపీఎల్‌కు కనెక్ట్ అయ్యారు.