ED Summons to Shikhar Dhawan : చిక్కుల్లో శిఖ‌ర్ ధావ‌న్‌.. స‌మ‌న్లు జారీ చేసిన ఈడీ

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు (Shikhar Dhawan ) జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌కు..

ED Summons to Shikhar Dhawan : చిక్కుల్లో శిఖ‌ర్ ధావ‌న్‌.. స‌మ‌న్లు జారీ చేసిన ఈడీ

ED Summons Cricketer Shikhar Dhawan

Updated On : September 4, 2025 / 11:54 AM IST

ED Summons to Shikhar Dhawan : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు (ED Summons to Shikhar Dhawan) జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఆయ‌న్ను విచారించ‌నుంది. మనీలాండరింగ్ కు సంబంధించి ధావ‌న్‌ను ఈడీ అధికారులు విచారించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

1xBet అనే అక్రమ (చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌)బెట్టింగ్‌ యాప్‌కు ధావ‌న్‌ ప్రమోషనల్ ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావ‌న్‌ను అధికారులు విచారించ‌నున్నారు.

Yashasvi Jaiswal fail : దులీప్ ట్రోఫీ సెమీస్‌.. య‌శ‌స్వి జైస్వాల్‌ విఫ‌లం.. తొలి ఓవ‌ర్‌లోనే..

అక్ర‌మ బెట్టింగ్ యాప్‌ల‌కు సంబంధించిన కేసుల‌ను ఈడీ ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్‌.. చాలా మంది వ్య‌క్తుల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను కోట్ల‌లో మోసం చేయ‌డంతో పాటు భారీ మొత్తంలో ప‌న్ను ఎగ‌వేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

నిషేదిత బెట్టింగ్ యాప్స్‌ను ప్ర‌యోట్ చేసిన కార‌ణంగా ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనా, టాలీవుడ్ న‌టులు రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌ వంటి వారు కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే.