Bigg Boss 5: నా నెత్తి మీద ఎక్కకు సిరి వెళ్ళిపో.. షణ్ముఖ్ ఫైర్ విత్ ఫైర్!
స్టార్ మా బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉండగా మరో ఎలిమినేషన్ ముగిస్తే ఇక ఫైనల్ కి చేరుకున్నట్లే.

Bigg Boss 5
Bigg Boss 5: స్టార్ మా బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉండగా మరో ఎలిమినేషన్ ముగిస్తే ఇక ఫైనల్ కి చేరుకున్నట్లే. అయితే.. షో చివరి దశకి వచ్చేకొద్దీ షో నిర్వాహకులు ఎంటర్ టైన్మెంట్ డోస్ పెంచి వరస టాస్కులతో కంటెస్టెంట్లతో ఫన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రోల్ ప్లేతో ఇంట్లో గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను మళ్ళీ రీ క్రియేట్ ఒకపక్క జరుగుతుంటే మరోపక్క సిరి షణ్ముఖ్ గిల్లికజ్జాలు, అలకలు షరా మామూలుగా జరిగిపోతున్నాయి.
RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!
ఇప్పటికే వచ్చేసిన ఎపిసోడ్స్ లో ప్రియాంక సింగ్, యానీ మాస్టర్‌గా మానస్.. షణ్ముఖ్‌గా సన్నీ.. లోబో, కాజల్‌గా శ్రీరామ్.. సన్నీగా సిరి.. ఇలా ప్రతి ఒక్కరు సమయానుసారంగా ఆయా పాత్రల్లో దూరిపోయి తెగ నవ్వించారు. ఇక, బుధవారం ఎపిసోడ్ ప్రోమో చూస్తే.. హమీదా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన సన్నీ శ్రీరామ్ సరసన వాలిపోయి తెగ నవ్వించేస్తున్నాడు. మరోపక్క షణ్ను సిరితో మళ్లీ గొడవపడ్డాడు. నీ కోసం నేను అందరికి నెగటివ్ అవుతున్నా నీకు నీ ఫ్రెండ్ కంటే మిగతా కంటెస్టెంట్స్ ముఖ్యమనుకుంటావ్ అంటూ రెచ్చిపోయాడు.
Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!
నీ కోసం ఫైట్ చేసే నేను నెగటివ్ అయ్యా తప్ప నాకు నేను నెగటివ్ కాలేదు.. కానీ నీకు అదే తప్పవుతుంది. నీకు నేను ఎంతో మిగతా కంటెస్టెంట్స్ అంతే.. ఇకపై మిగతా హౌస్‌మేట్స్ ఎలాగో నువ్వూ అంతే, నా నెత్తి మీద ఎక్కకు.. వెళ్లిపో అని తెగేసి చెప్పాడు షన్ను. ప్రతిదాన్ని షన్ను భూతద్దంలో పెట్టి చూస్తూ అన్నీ తప్పుగా ఊహించుకుంటూ సిరికి చుక్కలు చూపిస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఫినాలే దగ్గర పడుతుండగా షన్నులో అసహనం వచ్చేస్తుందా లేక ఇందులో కూడా ఏదైనా గేమ్ ప్లాన్ చేశాడా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Bhola Shankar: చిరు జెట్ స్పీడ్.. షూట్ అప్డేట్స్ ఇచ్చిన యూనిట్!