Shanmukh Jaswanth : అవన్నీ గుర్తుచేసుకొని స్టేజిపైనే ఏడ్చేసిన ‘షన్ను’.. అమ్మా నాన్న సారీ.. షణ్ముఖ్ జస్వంత్ ఈజ్ బ్యాక్..
వివాదాల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత సినిమాలో హీరోగా షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ ఇవ్వడం, మొదటిసారి మీడియా ముందు అధికారికంగా రావడంతో స్టేజి పైన తనకు జరిగినవన్నీ గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

Shanmukh Jaswanth Got Emotional on Leela Vinodham Movie Event
Shanmukh Jaswanth : షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబ్ లో తన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు మరింత దగ్గరయి తెలుగులోనే అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ సెట్ చేసాడు షన్ను. ఆ తర్వాత దీప్తి సునైనాతో ప్రేమ, బిగ్ బాస్ లోకి ఎంట్రీ, దీప్తితో బ్రేకప్ తో వైరల్ అయ్యాడు. కానీ కొన్నాళ్ల క్రితం గంజాయి సేవించాడని, ఓ యాక్సిడెంట్ చేసాడని, వాళ్ళ అన్నయ్య ఓ అమ్మాయిని మోసం చేసాడని.. ఇలా పలు వివాదాలతో వార్తల్లో నిలిచాడు.
ఎప్పటికైనా హీరో అవుతాడు అనుకున్న షణ్ముఖ్ కి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు రావడంతో కొన్నాళ్ళు ఎవరికీ కనపడలేదు, ఎలాంటి కంటెంట్ చేయలేదు. ఆల్మోస్ట్ సంవత్సరం గ్యాప్ తర్వాత ఇప్పుడు హీరోగా ఓటీటీ సినిమాతో గ్రాండ్ గా కంబ్యాక్ ఇస్తున్నాడు. షణ్ముఖ్, అనఘ జంటగా తెరకెక్కిన లీల వినోదం సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధిచిన ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంతో మొదటిసారి మీడియా ముందుకు వచ్చాడు షణ్ముఖ్ జస్వంత్.
Also Read : Pushpa 2 : బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ ఊచకోత.. 11 రోజుల వసూళ్లు ఎంతంటే?
ఇన్ని వివాదాల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత సినిమాలో హీరోగా షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ ఇవ్వడం, మొదటిసారి మీడియా ముందు అధికారికంగా రావడంతో స్టేజి పైన తనకు జరిగినవన్నీ గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈవెంట్లో షణ్ముఖ్ మాట్లాడుతూ.. వైజాగ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నేను హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు చేసుకున్నాను. నాకు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేదు. నేనే మా అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలి. కానీ నేను చేయని కొన్ని తప్పులకు నన్ను బ్లేమ్ చేసారు. నా మీద చాలా నెగిటివిటి చూపించారు. నేను తట్టుకున్నాను కానీ మా ఫ్యామిలీ మీద కూడా ఆ నెగిటివిటి చూపించారు. అమ్మా నాన్నా సారీ. నా వల్ల మీరు చాలా ఫేస్ చేసారు. అయినా మీరు నాకు సపోర్ట్ చేసారు. సక్సెస్ లో ఉన్నప్పుడు చాలా మంది మన పక్కన ఉంటారు. కానీ మనం పడినప్పుడు మన పక్కన ఉండే వాళ్ళే నిజమైన మన వాళ్ళు అంటూ ఇటీవల జరిగిన వివాదాలు, తనపై వచ్చిన విమర్శలను తలుచుకుంటూ ఎమోషనల్ అయి స్టేజిపై ఏడ్చేశాడు.
దీంతో షణ్ముఖ్ జస్వంత్ స్పీచ్ వైరల్ గా మారింది. ఇన్నాళ్లు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మెప్పించిన షన్ను ఇప్పుడు సినిమాల్లో ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. షన్నుకి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. షన్ను హీరోగా ఆల్రెడీ ఒక థియేట్రికల్ సినిమా మొదలయి షూటింగ్ జరుగుతుంది.