Shanmukh Jaswanth : సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. డిప్రెషన్ లో ఉన్నాను.. అందుకే గంజాయి తీసుకున్నా..

యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, అతని అన్న ఇటీవల గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే.

Shanmukh Jaswanth : సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. డిప్రెషన్ లో ఉన్నాను.. అందుకే గంజాయి తీసుకున్నా..

Shanmukh Jaswanth Sampath Vinay Case Update Interesting Facts

Updated On : February 25, 2024 / 5:54 PM IST

Shanmukh Jaswanth : యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, అతని అన్న ఇటీవల గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసుల నుంచి అప్డేట్ వచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవించినట్టు పోలీసులు నిర్దారించారు.

అయితే షణ్ముఖ్ జస్వంత్.. డిప్రెషన్ లో ఉన్నాను అని, నా పరిస్థితి ఏం బాగోలేదు అని, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని అందుకే గంజాయి తీసుకున్నాను అని తెలిపినట్టు సమాచారం. షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అతని కోసం వెళ్లగా అన్నదమ్ములు గంజాయి సేవిస్తూ బయటపడ్డారు.

Also Read : Niharika Konidela : ఆహా కోసం మళ్లీ యాంకర్‌గా మారబోతున్న నిహారిక

తాజాగా సంపత్ వినయ్ పై మరో కేసు కూడా నమోదు అయింది. సంపత్ తో పాటు MBA చదివిన ఓ అమ్మాయి వద్ద 20 లక్షలు తీసుకొని, బిజినెస్ పేరుతో మోసం చేసాడని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆ యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీంతో షణ్ముఖ్ జస్వంత్, అతని అన్న సంపత్ వినయ్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.