Niharika Konidela : ఆహా కోసం మళ్లీ యాంకర్‌గా మారబోతున్న నిహారిక

మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి యాంకర్ అవతారం ఎత్తబోతున్నారు. ఆహాలో రాబోతున్న కార్యక్రమంలో తన యాంకరింగ్‌తో సందడి చేయబోతున్నారు.

Niharika Konidela : ఆహా కోసం మళ్లీ యాంకర్‌గా మారబోతున్న నిహారిక

Niharika Konidela

Updated On : February 25, 2024 / 1:16 PM IST

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా, యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న నిహారిక మరోసారి యాంకర్ అవతారం ఎత్తబోతున్నారు. ఆహాలో ‘చెఫ్ మంత్ర సీజన్ 3’ తో మార్చి 3 నుండి సందడి చేయబోతున్నారు.

Niharika Konidela 2

Niharika Konidela 2

Divvya Khosla Kumar : స్టార్ ప్రొడ్యూసర్‌తో నటి విడాకులు?

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక మొదట యాంకర్‌గా చేసారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాక ‘ఒక మనసుతో’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలతో పాటు సైరా సింహారెడ్డి సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. వెబ్ సిరీస్‌లో నటిస్తూ OTT సినిమాలకు నిర్మాతగా కూడా నిహారిక మరోసారి యాంకర్ అవతారం ఎత్తబోతున్నారు. ఆహాలో ‘చెఫ్ మంత్ర సీజన్ 3’ హోస్ట్ చేయబోతున్నారు. మొదటి సీజన్ యాంకర్ శ్రీముఖి, రెండవ సీజన్ మంచు లక్ష్మి హోస్ట్ చేసారు. ఈ రెండు సీజన్స్ కూడా సక్సెస్ ఫుల్ అయ్యాయి. ఇక మూడో సీజన్ నిహారిక చేస్తుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది.

Vanitha Vijaykumar : నా తండ్రి మాటలు వినడం వల్లే నా జీవితం నాశనం అయింది

‘చెఫ్ మంత్ర సీజన్ 3’ మార్చి 3 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూడో సీజన్‌లో సెలబ్రిటీల ఫన్నీ చిట్ చాట్స్, కావాల్సినంత వినోదం పంచబోతున్నారట. ఈ సీజన్‌లో 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆహాలో ఈ ఎపిసోడ్స్ వస్తుంటాయి. వినోదంతో పాటు ఆటలు, రకరకాల టాస్క్‌లతో ఈసారి సీజన్ మరింత ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 3న చెఫ్ మంత్ర సీజన్ 3 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఆహా సబ్ స్క్రైబర్లకు పూర్తి స్ధాయిలో వినోదం అందబోతోందన్నమాట. ఈ సీజన్‌తో నిహారిక తన మార్క్ చూపించబోతోందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.