SHARWA-37 : ‘శ‌ర్వా 37’ కోసం నంద‌మూరి, కొణిదెల హీరోలు.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్‌..

ఈ మూవీ శ‌ర్వానంద్ కెరీర్‌లో 37వ చిత్రంగా తెర‌కెక్కుతోంది.

SHARWA-37 : ‘శ‌ర్వా 37’ కోసం నంద‌మూరి, కొణిదెల హీరోలు.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్‌..

SHARWA-37 title and first look release date fix

Updated On : January 8, 2025 / 11:31 AM IST

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే న‌టుల్లో యంగ్ హీరో శ‌ర్వానంద్ ఒక‌రు. గ‌తేడాది ఆయ‌న మ‌నమే చిత్రంతో పల‌క‌రించారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అందులో ద‌ర్శ‌కుడు రామ్ అబ్బ‌రాజుతో చేస్తున్న చిత్రం ఒక‌టి. ఈ మూవీ శ‌ర్వానంద్ కెరీర్‌లో 37వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చింది.

ఈ చిత్ర టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల తేదీని వెల్ల‌డించింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్  చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. నంద‌మూరి, కొణిదెల హీరోలు చేతుల మీదుగా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

Yash birthday : య‌శ్ పుట్టిన రోజు.. ‘టాక్సిక్’ బర్త్‌డే పీక్ వీడియో వ‌చ్చేసింది.. గూస్‌బంప్స్..

అయితే.. ఈ పోస్ట‌ర్స్ విడుద‌ల చేసే మెగా, నంద‌మూరి హీరోలు ఎవ‌రు అనేది మాత్రం చెప్ప‌లేదు. దీంతో దీని కోసం అటు మెగా, నంద‌మూరి, శ‌ర్వా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Raja saab : ప్ర‌భాస్ అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించే వార్త చెప్పిన త‌మ‌న్‌..

ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్యలు క‌థానాయిక‌లు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.