George Krish : జార్జ్ క్రిష్ నుంచి ఫస్ట్ బూస్టర్ రిలీజ్.. విభిన్న గెటప్స్‌లో శర్వానంద్..
శర్వానంద్ హీరోగా నటిగా నటిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్(George Krish).
Sharwanand George Krish First Booster
George Krish : శర్వానంద్ హీరోగా నటిగా నటిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మానస వారణాసి కథానాయిక. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా.. నేడు దర్శకుడు శ్రీను వైట్ల బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ బూస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ భిన్నమైన గెటప్‌లలో ఆకట్టుకున్నాడు. చర్చిలో ఫాదర్‌గా, స్వామీజీగా అలరించాడు. మొత్తంగా ఈ ఫస్ట్ బూస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది.
