Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్.. ‘హిట్‌మ్యాన్’ పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో
క్రికెటర్ రోహిత్ శర్మ బయోపిక్ లో నటించడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శర్వానంద్(Sharwanand).
Sharwanand interesting comments on doing Rohit Sharma biopic.
- తెరపైకి రోహిత్ శర్మ బయోపిక్
- ఆసక్తికర కామెంట్స్ చేసిన శర్వానంద్
- అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని క్లారిటీ
Sharwanand: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్రముఖుల బయోపిక్‌ల తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ వంటి స్టార్ క్రికెటర్స్ బయోపిక్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు, ఆ లిస్టులో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ పేరు కూడా చేరనుంది. ఆయన బయోపిక్ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
రోహిత్ శర్మ అభిమానులు సైతం ఆయన బయోపిక్ ను తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పాత్రకు టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ సరిగ్గా సరిపోతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా శర్వానంద్(Sharwanand) నటించిన ‘బైకర్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రిపోర్ట్స్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై శర్వానంద్ కూడా స్పందించాడు.
Ranveer- Deepika: రూమర్స్ కి చెక్ పెట్టిన దీపికా పదుకొణె.. భారీ విజయంలో భర్తకు సపోర్ట్ గా!
“రోహిత్ శర్మ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఒకవేళ ఆ కథ నా వద్దకు వచ్చి, అవకాశం దక్కితే మాత్రం తప్పకుండా నటించడానికి సిద్ధమే” అని క్లారిటీ ఇచ్చారు. గతంలో రోహిత్ శర్మకు తన లుక్ దగ్గరగా ఉంటుందని చాలా మంది అన్నారని, అయితే ప్రస్తుతానికి మాత్రం తన దృష్టంతా ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘బైకర్’ సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. దీంతో శర్వానంద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక బైకర్ మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. బైక్ రేసింగ్ కాన్సెప్ట్ తో తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటిసారి కావడంతో బైకర్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. మరి సరికొత్త కథాకథనాలతో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూడాలి.
