NTR Devara : ‘దేవర’లో ఎన్టీఆర్ కోసం మరో విలన్.. అదిరిపోయిన అప్డేట్.. మలయాళం స్టార్ రంగంలోకి..
దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా చాలా మాస్ గా, పవర్ ఫుల్ గా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే రిలీజయిన ఫస్ట్ లుక్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.

Shine Tom Chacko plays key role in NTR Devara Movie update from Devara Movie
Shine Tom Chacko : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR) చాలా గ్యాప్ తీసుకొని తన 30వ సినిమాని మొదలుపెట్టారు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో కళ్యాణ్ రామ్(Kalyan Ram) నిర్మాణంలో ఎన్టీఆర్ 30వ సినిమా ‘దేవర'(Devara)గా తెరకెక్కుతుంది. ఇందులో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్(Tollywood) లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. దేవర సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు.
దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా చాలా మాస్ గా, పవర్ ఫుల్ గా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే రిలీజయిన ఫస్ట్ లుక్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా మరో మలయాళ స్టార్ నటిస్తున్నట్టు సమాచారం.
Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవ్వదా? మహేశ్ అభిమానుల్లో నిరాశ..
దీనిపై చిత్రయూనిట్ అధికారిక అప్డేట్ ఇవ్వకపోయినా ఆ మలయాళం స్టార్ ఫ్యాన్స్ చేసిన పోస్టర్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్నీ లీక్ చేశాడు. మలయాళంలో పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన షైన్ టామ్ చాకో ఇటీవల తెలుగులో దసరా సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా విలన్ గా నటిస్తారని సమాచారం. దీంతో షైన్ టామ్ చాకో షేర్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇలా సడెన్ గా షైన్ టామ్ చాకో పోస్టర్స్ షేర్ చేసి అప్డేట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.