Shivani Nagaram : ‘లిటిల్ హార్ట్స్’ హీరోయిన్ లవ్ స్టోరీ.. పాపం.. ఈమె వెళ్లి ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా?

లిటిల్ హార్ట్స్ సినిమాతో స్టార్ అయిపోయిన హీరోయిన్ శివాని నగరం తాజాగా తన లవ్ స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. (Shivani Nagaram)

Shivani Nagaram : ‘లిటిల్ హార్ట్స్’ హీరోయిన్ లవ్ స్టోరీ.. పాపం.. ఈమె వెళ్లి ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా?

Shivani Nagaram

Updated On : September 14, 2025 / 5:01 PM IST

Shivani Nagaram : శివాని నగరం.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. తెలుగమ్మాయి శివాని నగరం ఒక సింగర్. సంగీతం క్లాస్ లు కూడా చెప్పేది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాని. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఇటీవల లిటిల్ హార్ట్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ కొట్టింది.(Shivani Nagaram)

లిటిల్ హార్ట్స్ సినిమాలో శివాని.. కాత్యాయనీ అనే రోల్ లో నటించి యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం శివాని సక్సెస్ మూడ్ లో ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాని తన లవ్ స్టోరీ గురించి చెపింది.

Also See : Mrunal Thakur : ఏడేళ్ల క్రితం సినిమా.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన మృణాల్.. అప్పుడు ఎలా ఉందో చూడండి. ఫోటోలు వైరల్..

శివాని నగరం తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. నేను ట్యూషన్ లో ఒక అబ్బాయికి సిల్క్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాను. నాకు మ్యాథ్స్ రాదు. అతను మ్యాథ్స్ లో టాపర్. నాకు హెల్ప్ చేసాడు. అలా నచ్చి ప్రపోజ్ చేస్తే నేను ఇచ్చిన సిల్క్ చాక్లెట్ తీసుకొని నన్ను రిజెక్ట్ చేసాడు. నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు నాకు చెల్లి లాంటిదానివి అన్నాడు. అప్పట్నుంచి ఇక అలాంటివి అన్ని కట్. తర్వాత ఎందుకో అందరూ అక్క అనే పిలిచారు. ఇప్పుడు అయితే లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పుకొచ్చింది.

అలాగే తనకు కాబోయే వాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడిగితే.. వంట వచ్చి ఉండాలి, చెప్పిన మాట వినాలి, నన్ను బాగా చూసుకోవాలి అని తెలిపింది శివాని. దీంతో శివాని చెప్పిన లవ్ స్టోరీ వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు ఇంత అందమైన అమ్మాయి ప్రపోజ్ చేస్తే వద్దని చెల్లి అనడమేంటి అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Director Maruthi : డైరెక్టర్ కి కౌంటర్ ఇచ్చిన మారుతి.. నేను చెప్పినా వినలేదు.. చిల్లర పనులు చేయొద్దు.. ఆడియన్స్ ని తిడతారేంటి?