Shivaraj Kumar : తెలుగులో ప్రెస్ మీట్ పెట్టిన కన్నడ స్టార్స్.. క్యాన్సర్ అని తెలిసాక కీమో థెరపీ చేయించుకుంటూ ఈ సినిమా షూటింగ్..

కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా '45'.

Shivarajkumar Upendra Raj B Shetty Press Meet in Hyderabad Regarding 45 Movie

Shivaraj Kumar : కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ’45’. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి.ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మాణంలో సంగీత దర్శకుడు అర్జున్ జన్యా డైరెక్టర్ గా మారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 45 సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కానుంది. టీజర్ ముందే రిలీజ్ చేసినా తాజాగా దీనికి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.

Also Read : SS Thaman : ఇదేం ట్యాలెంట్ బ్రో.. పైలెట్స్ నన్ను మోసం చేయలేరు.. ఆసక్తికర విషయం చెప్పిన తమన్..

హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్ ను డైరెక్షన్ చేయమని ఒప్పించాను. ఈ సినిమాలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను సినిమానే లోకంగా బతుకుతుంటాడు. ఈ సినిమాలో కొత్త స్క్రీన్ ప్లేను తెరపై చూస్తారు. ఈ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. అయినా కీమో థెరపీ తీసుకుంటూనే షూటింగ్ చేశాను. రామ్ చరణ్ గారితో కలిసి పెద్ది సినిమాలో నటిస్తున్నాను. చరణ్ వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జైలర్ సినిమాలో నా పాత్రకు అంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. రజినీకాంత్ కోసమే ఆ సినిమా చేశాను. ఇప్పుడు జైలర్ 2లో కూడా ఉన్నాను అని తెలిపారు.

Also Read : OG Song : పవన్ OG ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన తమన్.. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో కూడా చెప్పి..

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. 45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు. ఆయన కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్ గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాలో నా ఓం సినిమాకు సంబంధించిన డైలాగ్ ఎంతో క్రియేటివ్ గా వాడారు. వందకు పైగా సినిమాలకు సంగీతం చేసిన ఆయన ఇప్పుడు డైరెక్టర్ గా మారుతున్నారు. శివన్నతో ఓం సినిమా తీసాను. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. కూలి సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటిస్తున్నాను అని తెలిపారు.

ఈ ఈవెంట్లో నిర్మాత ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కాన్సెప్ట్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు 45 లాంటి మూవీ కావాలి. సనాతన ధర్మం గురించి కూడా ఈ సినిమాలో ఉంది అని తెలిపారు. డైరెక్టర్ అర్జున్ జన్యా మాట్లాడుతూ.. శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఈ సినిమాకు నువ్వే డైరెక్షన్ చేయి అని ఎంకరేజ్ చేశారు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా ఎంతో సపోర్ట్ చేసారు. ఉపేంద్ర గారిని ఎలాంటి పాత్రలోనైనా డైరెక్టర్స్ చూపించగలరు. ఆయన దర్శకులకే దర్శకుడు. 45 మూవీని ముందు సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు, ప్రొడ్యూసర్స్ కు బడ్జెట్ ఆదా అవుతుంది అని తెలిపారు.

45 టీజర్ చూసేయండి..

Also Read : Thaman – Game Changer : 140 కోట్ల లాస్.. ‘గేమ్ ఛేంజర్’ పై కావాలని చేసారు.. తమన్ వ్యాఖ్యలు వైరల్..