Shobha Shetty : మా నాన్నని మోసం చేసారు.. అమ్మ బంగారు తాళి అమ్మి డబ్బులు తెస్తే ఆడిషన్స్ కి వెళ్ళాను..
తాజాగా శోభా శెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ఫ్యామిలీ కష్టాలు తెలిపింది.

Shobha Shetty
Shobha Shetty : కన్నడ, తెలుగులో సీరియల్స్ తో పాటు బిగ్ బాస్ తో పాపులార్టీటీ తెచ్చుకుంది శోభా శెట్టి. తెలుగులో కార్తీక దీపం సీరియల్ లో మోనిత అనే నెగిటివ్ పాత్రలో బాగా వైరల్ అయింది. తాజాగా శోభా శెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ఫ్యామిలీ కష్టాలు తెలిపింది.
శోభాశెట్టి మాట్లాడుతూ.. మా నాన్నని మోసం చేసి డబ్బులు తీసుకున్నారు. మేము బెంగుళూరుకు వచ్చేసాం. నేను ఆడిషన్స్ కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. మా అమ్మ తాళికి ఉండే బంగారు చైన్ అమ్మి బెంగుళూరులో రెంట్ కి ఇల్లు తీసుకున్నాం, సామాన్లు తెచ్చుకున్నాం. ఆ డబ్బులతోనే నేను ఆడిషన్స్ కి వెళ్ళాను. నేను అప్పుడే అనుకున్నాను నేను సంపాదిస్తే మా అమ్మ తాళికి ఆ బంగారు చైన్ చేయిస్తా అని. డబ్బుల కోసం ఒకానొక సమయంలో తెలుగు, తమిళ్, కన్నడ మూడు భాషల్లో ఖాళీ లేకుండా కష్టపడ్డాను. బ్రేక్స్ తీసుకోకుండా ఎయిర్ పోర్ట్స్ లో, ట్రావెలింగ్ లో నేను, అమ్మ పడుకునేవాళ్ళం. సక్సెస్ అయ్యాక మా అమ్మకు చైన్ కొన్నిచ్చాను. ఇప్పటికి మా అమ్మ అది మెడలోంచి తీయదు అని తెలిపింది.