Breaking : విజయ్ సేతుపతిపై ఎయిర్‌పోర్టులో దాడి.. షాకింగ్ విజువల్స్

ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుండగా ఘటన

Breaking : విజయ్ సేతుపతిపై ఎయిర్‌పోర్టులో దాడి.. షాకింగ్ విజువల్స్

Vijay Sethupathi Pic

Updated On : November 3, 2021 / 8:00 PM IST

Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతికి ఊహించని సంఘటన ఎదురైంది. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుండగా…. విజయ్ సేతుపతిపై దాడి జరిగింది. ఈ సంఘటనతో విజయ్ సేతుపతితో పాటు.. ఆయనతో పాటు ఉన్న అనుచరులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు.

ఎయిర్ పోర్టులో ఫ్లైట్ దిగి ఎగ్జిట్ వైపు వస్తుండగా.. వెనుక నుంచి ఓ పొడవాటి వ్యక్తి విజయ్ సేతుపతిని ఎగిరి తన్నాడు. దీంతో.. ఒక్కసారిగా అదిరిపడ్డాడు విజయ్ సేతుపతి. చుట్టుపక్కన ఉన్నవాళ్లు.. సెక్యూరిటీ, పోలీసులు.. వెంటనే ఆ దుండగున్ని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 6 సెకన్ల వీడియోలో ఇంతవరకే ఉంది.

ఎయిర్ పోర్టులో.. విజయ్ సేతుపతి అసిస్టెంట్ కు.. ఓ తాగి ఉన్న ప్రయాణికుడికి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. విజయ్ అసిస్టెంట్ కు.. అతడికి మధ్య ఘర్షణ దాకా వెళ్లినట్టు సమాచారం. గొడవ వద్దని వెళ్లిపోతుంటే…. వెనకాల నుంచి వచ్చి ఆ ప్యాసింజర్ ఎగిరి తన్నినట్టు కొందరు చెబుతున్నారు. ఈ దాడితో విజయ్ సేతుపతి అసిస్టెంట్ తోపాటు… విజయ్ కూడా ఒక్కసారిగా షేకయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత.. కొంత సేపటికి అతడు సారీ చెప్పడంతో.. గొడవ సద్దుమణిగినట్టు తెలిసింది.