Shruti Haasan : కాన్స్‌ ఫెస్టివల్‌లో శృతిహాసన్ ఆ అంశం పై చర్చ.. మళ్ళీ ‘వాల్తేరు వీరయ్య’ గురించి చెబుతుందా?

కాన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న శృతిహాసన్.. సినీ పరిశ్రమలో మహిళల సమస్యలు గురించి ప్రస్తావించనుంది. మళ్ళీ ఇప్పుడు మరోసారి 'వాల్తేరు వీరయ్య' విషయం తీసుకువచ్చి విమర్శలు ఎదురుకుంటుందా?

Shruti Haasan : కాన్స్‌ ఫెస్టివల్‌లో శృతిహాసన్ ఆ అంశం పై చర్చ.. మళ్ళీ ‘వాల్తేరు వీరయ్య’ గురించి చెబుతుందా?

Shruti Haasan attending Cannes Film Festival and Chiranjeevi Waltair Veerayya

Updated On : May 16, 2023 / 3:52 PM IST

Shruti Haasan Cannes Film Festival : సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ ఏడాదిని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ (Balakrishna) వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ (Salaar), Nani30, The Eye అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటిస్తుంది. తాజాగా ఈ భామ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ‘కాన్స్‌’కి ఆహ్వానం అందుకుంది. ఆ ఫెస్టివల్ శృతి లింగ సమానత్వాన్ని గురించి మాట్లాడనుంది.

Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!

సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్ రౌండ్ టేబుల్ చర్చలో మాట్లాడనుంది. అయితే ఈ అంశమే టాలీవుడ్ ఆడియన్స్ ని శృతిహాసన్ పై దృష్టి పెట్టేలా చేస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ సృస్తిహాసం ఏమి మాట్లాడుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం గతంలో ఆమె వాల్తేరు వీరయ్య సినిమా గురించి చేసిన వ్యాఖ్యలే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్.. “మంచులో డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. హీరోలు చలిని ఆపే జాకెట్స్ వేసుకొని డాన్స్ చేస్తారు. కానీ హీరోయిన్లు మాత్రం చీరలోనే డాన్స్ చేయాలి. ఇబ్బందిగా ఉందని డైరెక్టర్ ని బ్రతిమాలినా వినకుండా చీరలోనే డాన్స్ చేయించారు. ఇక నుంచి అయినా ఆ పద్ధతి మార్చండి” అంటూ వాల్తేరు వీరయ్య గురించి చెప్పుకొచ్చింది.

Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!

ఆ కామెంట్స్ పై మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఆర్టిస్ట్ లు అన్నాక సమస్యలు ఎదురుకొని నటించాల్సిన సందర్భాలు వస్తుంటాయి. అలా చేయడం ఆర్టిస్ట్ గా తమ భాద్యత, అలాగే ఆ సమస్యలను తమలోని ఉంచుకోవాలి గాని ఇలా మాట్లాడడం సరి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కాన్స్‌ ఫెస్టివల్‌లో శృతిహాసన్ సినీ పరిశ్రమలో మహిళల సమస్యలు గురించే మాట్లాడబోతుండడంతో.. మళ్ళీ ‘వాల్తేరు వీరయ్య’ గురించి ప్రస్తావన తెస్తుందా? అని సందేహం మొదలైంది.