Shruti Haasan : ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తా అనుకోలేదు.. 13 ఏళ్ళు అప్పుడే అయిపోయాయి..

తాజాగా శృతి హాసన్ సినీ పరిశ్రమకి వచ్చి 13 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోతో పాటు, ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శృతి హాసన్ మాట్లాడుతూ..........

Shruti Haasan : ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తా అనుకోలేదు.. 13 ఏళ్ళు అప్పుడే అయిపోయాయి..

Shruti Haasan

Updated On : July 26, 2022 / 7:30 AM IST

Shruti Haasan :  లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రుతి హాసన్‌. లక్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురవడంతో ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు. కానీ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇక అక్కడి నుంచి వెనుతిరగలేదు. తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు హిందీలో కూడా సినిమాలు చేసింది. నటిగానే కాకుండా గాయనిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, వ్యాఖ్యాతగా ప్రేక్షకులని మెప్పించింది.

తాజాగా శృతి హాసన్ సినీ పరిశ్రమకి వచ్చి 13 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోతో పాటు, ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శృతి హాసన్ మాట్లాడుతూ.. ”13 ఏళ్లు.. అద్భుతంగా ఉంది. ఒక్క సినిమా కంటే ఎక్కువ చేస్తానని అనుకోలేదు. నేను సినిమా కోసమే పుట్టకపోయినా సినిమాను ప్రేమించడం నేర్చుకున్నాను. ఇండస్ట్రీకి, ఫ్యాన్స్‌కి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి జీవితాన్ని ఇండస్ట్రీ నాకిచ్చింది. ఇన్నేళ్లుగా చాలా నేర్చుకున్నాను. గెలుపు, ఓటములను ఎలా తీసుకోవాలి, ఆత్మస్థైర్యంతో ఎలా ముందుకెళ్లాలి, కథలను చెప్తున్న వారిని ఎలా అభినందించాలి, ఎప్పుడూ కలవని మనుషులతో ఎలా ఉండాలి.. ఇలా చాలానే నేర్చుకున్నాను. నేను ఫ్యాన్స్ రూపంలో పొందుతున్న ప్రేమకు అందరికి రుణపడి ఉంటాను. నా ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదలు. నా కెరీర్ లో ఈ 13 ఏళ్లకు చాలా థాంక్స్”అని పోస్ట్ చేసింది.

Katrina Kaif : కత్రినా నా భార్య.. చంపేస్తాను అంటూ బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

శృతి హాసన్ 13 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యలో మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలతో బిజీగా మారింది.

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)