Shubman Gill : స్పైడర్ మ్యాన్ కోసం శుభ్మన్ గిల్ ప్రమోషన్స్.. కారు మీద స్టంట్స్!
టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్ స్పైడర్ మ్యాన్ మూవీకి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా..

Shubman Gill promotions for Spider Man Across The Spider Verse
Shubman Gill Spider Man : టీమిండియా క్రికెటర్ (Cricketer) శుభ్మన్ గిల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. తన ఆటతో అబ్బాయిల అభిమానం, తన హ్యాండ్సమ్ లుక్స్ అమ్మాయిల మనసుని దోచుకుంటుంటాడు. ఇక ఇప్పటివరకు ఇండియన్ క్రికెటర్ గా, IPL లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ప్లేయర్ గా అదరగొడుతూ వస్తున్న శుభ్మన్.. ఇటీవల సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టేశాడు. ఒక హాలీవుడ్ మూవీ కోసం తన గొంతుని సవరించి డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయ్యాడు.
స్పైడర్ మ్యాన్ – ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ (Spider Man Across The Spider Verse) అనే యానిమేషన్ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇండియాలో ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భారీగా రిలీజ్ చేస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, పంజాబీ, గుజరాతి, మరాఠీ, బెంగాలీ, కన్నడ, మలయాళం.. భాషల్లో ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలోని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి శుభ్మన్ గిల్ డబ్బింగ్ చెపుతున్నాడు. హిందీ, పంజాబీ వర్షన్ లో స్పైడర్ మ్యాన్ కోసం శుభ్మన్ వాయిస్ ని ఇస్తున్నాడు.
Pushpa 2 : ప్రతీకారంతో తిరిగొచ్చిన షెకావత్ సర్.. పుష్ప 2 అప్డేట్..
తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. జూన్ 1న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శుభ్మన్ గిల్ కూడా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే రోడ్ పై ఆగి ఉన్న కారు ఎక్కి స్పైడర్ మ్యాన్ లా స్టంట్ ఫోజులిస్తూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక హాలీవుడ్ మూవీ కోసం ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram