Chinna Movie : ‘చిన్నా’ మూవీ రివ్యూ.. చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలను ఎమోషనల్‌గా చూపించి..

చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. సిద్దార్థ్ మాత్రం తన పాప కోసం వెతికే ఒక బాబాయ్ పాత్రలో చాలా బాగా నటించాడు.

Chinna Movie : ‘చిన్నా’ మూవీ రివ్యూ.. చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలను ఎమోషనల్‌గా చూపించి..

Siddharth Chinna Movie Movie Review and Rating

Chinna Movie Review : సిద్దార్థ్ (Siddharth) హీరోగా అరుణ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘చిన్నా’. నిమిషా సజయన్, సహస్ర శ్రీ ముఖ్యపాత్రలో నటించారు. తమిళ్ లో చిత్తా అనే పేరుతో ఆల్రెడీ రిలీజయి పర్వాలేదనిపించిన ఈ సినిమా నేడు తెలుగులో చిన్నా అనే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాని సిద్దార్థ్ స్వయంగా నిర్మించారు.

కథ విషయానికి వస్తే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో ఓ జాబ్ చేసుకుంటూ సింపుల్ జీవితాన్ని గడిపేస్తుంటాడు హీరో ఈశ్వర్(సిద్ధార్థ్). ఓ పక్క చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళి రేప్ చేయడం, చంపేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అదే సమయంలో హీరో తన ఇంటి దగ్గరే ఉండే మరో పాపతో మాములుగా మాట్లాడినా అది తప్పుగా తీసుకొని ఈశ్వర్ కూడా ఇలాగే చేస్తాడు అని అంతా అనుకోని కొట్టి పోలీసుల అరెస్ట్ వరకు వెళ్తుంది. కానీ తర్వాత ఈశ్వర్ అన్న కూతురు కనిపించకపోవడంతో ఈశ్వర్, అతని ఫ్రెండ్స్, పోలీసులు పాపని ఎలా వెతికి పట్టుకున్నారు, ఇలాంటి పనులు చేసినవాడ్ని పట్టుకున్నారా అనేది తెరపై చూడాల్సిందే.

ఒక మంచి స్క్రీన్ ప్లే తో, ఎమోషనల్ కంటెంట్ తో కథని నడిపించాడు డైరెక్టర్. అయితే చైల్డ్ అబ్యూజింగ్, హరాజ్మెంట్, చైల్డ్ రేప్ కేసెస్.. ఇలాంటి కంటెంట్ ని చూపించడంతో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ సమాజంలో జరిగే ఇలాంటి వాటిపై సినిమా తీసి నిందితుల వైపే కాకుండా అలాంటి పరిస్థితులు ఎదుర్కున్న పిల్లల భవిష్యత్తు ఏంటి అని చివర్లో ఒక పాజిటివ్ పాయింట్ తో సినిమా ఎండ్ చేశారు.

Also Read : 800 Movie : ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ మూవీ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన బయోపిక్..

చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. సిద్దార్థ్ మాత్రం తన పాప కోసం వెతికే ఒక బాబాయ్ పాత్రలో చాలా బాగా నటించాడు. పాప క్యారెక్టర్ చేసిన సహస్ర శ్రీ కూడా అద్భుతంగా నటించింది. నిమిషా సజయన్ కూడా మెప్పించింది. అన్ని పాత్రలని ఒక మిడిల్ క్లాస్ లాంటి పాత్రలుగా తీసుకోవడంతో ఇంకా బాగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో కానీ విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంటుంది చిన్నా. ఈ సినిమాకు 3 వరకు రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..